అల్లు అర్జున్ “అసిస్టెంట్ డైరెక్టర్” గా పనిచేసిన ఒకే ఒక్క సినిమా ఏంటో తెలుసా..? ఆ సినిమా డైరెక్టర్ ఎవరంటే..?

అల్లు అర్జున్ “అసిస్టెంట్ డైరెక్టర్” గా పనిచేసిన ఒకే ఒక్క సినిమా ఏంటో తెలుసా..? ఆ సినిమా డైరెక్టర్ ఎవరంటే..?

by Mohana Priya

Ads

పుష్ప సినిమాతో భారతదేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నారు అల్లు అర్జున్. మెగా ఫ్యామిలీ అనే ఒక నేపథ్యం నుండి వచ్చినా కూడా, ఇప్పుడు తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు. ఇటీవల మేడం టుసాడ్స్ మ్యూజియంలో అల్లు అర్జున్ మైనపు విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేశారు. తెలుగు సినిమా పరిశ్రమని మరొక మెట్టు ఎక్కించడానికి అల్లు అర్జున్ తనవంతు ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటివరకు ఒక్కసారి కూడా తెలుగు నటుడికి ఉత్తమ నటుడు జాతీయ అవార్డు రాలేదు. అల్లు అర్జున్ పుష్ప సినిమాతో బెస్ట్ యాక్టర్ గా నేషనల్ అవార్డు అందుకొని ఈ ఘనత సాధించారు.

Video Advertisement

ఇంకా ఎన్నో అవార్డులను అందుకుంది. ఎంతో మంది ఈ సినిమాని పొగిడారు. ఇప్పుడు పుష్ప 2 కూడా భారీగా తెరకెక్కిస్తున్నారు. ఇటీవల పుష్ప 2 టీజర్ వచ్చింది. ఆ టీజర్ కి చాలా మంచి స్పందన వచ్చింది. పుష్పకి కొనసాగింపుగానే ఈ సినిమా రూపొందుతోంది. ప్రస్తుతం అల్లు అర్జున్ ఈ సినిమా షూటింగ్ పనిలో బిజీగా ఉన్నారు. అప్పుడప్పుడు బయటికి ఏదైనా ఈవెంట్స్ కి వస్తూ ఉంటారు. అందులో పుష్పకి సంబంధించి వార్తలు చెప్తూ ఉంటారు.

movie for which allu arjun worked as an assistant director

అయితే అల్లు అర్జున్ ఒకే ఒక్క సినిమాకి అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేశారు. ఆ సినిమా ఏదో తెలుసా? అల్లు అర్జున్ ఎస్వీ కృష్ణారెడ్డి దర్శకత్వం వహించిన పెళ్ళాం ఊరెళితే సినిమాకి అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేశారు. ఈ సినిమాకి అల్లు అరవింద్ నిర్మాతగా వ్యవహరించారు. ఇదే సినిమాకి అల్లు అర్జున్ కూడా అసిస్టెంట్ డైరెక్టర్ గా చేసి, సినిమా గురించి అవగాహన పెంచుకోవడానికి సినిమా బృందంతో చేరారు. అప్పుడు అల్లు అర్జున్ చాలా చిన్నవారు.

what did our star heros did before becoming stars..!!

అయినా కూడా సినిమా పట్ల తనకి ఉన్న ఆసక్తి వల్ల పెళ్ళాం ఊరెళితే సినిమాకి అసిస్టెంట్ డైరెక్టర్ గా చేశారు. అల్లు అర్జున్ ఈ సినిమాకి అసిస్టెంట్ డైరెక్టర్ గా చేసిన విషయం కూడా చాలా మందికి తెలియదు. కేవలం నటన వైపు మాత్రమే కాకుండా, మిగిలిన విషయాల్లో కూడా అన్నీ తెలిసి ఉండడం అనేది ముఖ్యం అనే ఉద్దేశంతోనే అల్లు అర్జున్ ఇలా నేర్చుకున్నారు. అందుకే అల్లు అర్జున్ ఇప్పుడు తను పనిచేసే ప్రతి సినిమా విషయంలోనూ చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు. చిన్న చిన్న విషయాలు కూడా చాలా శ్రద్ధగా చూసుకుంటూ ఉంటారు. పుష్ప సినిమాకి కూడా ఇప్పుడు శ్రద్ధగా పనిచేస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ పనిలో అల్లు అర్జున్ ఉన్నారు.

ALSO READ : IPL ఫైనల్ మ్యాచ్ డేట్ ని 25 కి మార్చాలని RCB ఫ్యాన్స్ డిమాండ్.. ఎందుకో తెలుసా.?


End of Article

You may also like