Alia Bhatt: అలియా, రణబీర్ ల పెళ్లి వాయిదా పడడానికి కారణం అదేనా…?

Alia Bhatt: అలియా, రణబీర్ ల పెళ్లి వాయిదా పడడానికి కారణం అదేనా…?

by Anudeep

Ads

బాలీవుడ్ సెలబ్రిటీలలో అలియా, రణబీర్ ల కపుల్ కి చాలానే ఫాలోయింగ్ ఉంది. వీళ్లిద్దరు పీకలలోతు ప్రేమలో ఉన్నారని గత కొంతకాలంగా ప్రచారం జరుగుతూనే ఉంది. అయితే.. తాము పెళ్లి చేసుకోబోతున్నామని ప్రకటించి ఈ జంట ఫ్యాన్స్ ని ఫుల్ ఖుష్ చేసేసింది.

Video Advertisement

ఓ వైపు కెరీర్ పరంగా బిజీగా ఉంటున్నప్పటికీ.. ఈ జంట చెట్టాపట్టాలేసుకుని తిరిగేస్తున్నారు. గతేడాదే వీరి పెళ్లి జరగాల్సి ఉన్నప్పటికీ.. కరోనా కారణంగా వాయిదా పడింది.

alia bhatt

తాజాగా.. ఈ ఏడాది డిసెంబర్ లో వీరి వివాహం జరగాల్సి ఉంది. కాగా.. అదికూడా మరోసారి వాయిదా పడింది. ఇప్పటికే వీరిద్దరూ కమిట్ అయిన సినిమాలు పెండింగ్ లో ఉన్నాయట. అందుకే.. ఆ సినిమాలను పూర్తి చేసుకుని.. తరువాత డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకోనున్నారట. ఆ తర్వాత ఓ ఖరీదైన ఫ్లాట్ కి కూడా మారతారట. ఈలోపు పెండింగ్ లో ఉన్న పనులు పూర్తి చేసుకుని వచ్చే ఏడాది ఏప్రిల్, మే నెలల్లో పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారట. ఇందులో వాస్తవాలు ఎంత వరకు ఉన్నాయో తెలియదు కానీ.. ప్రస్తుతం ఈ వార్త మాత్రం తెగ వైరల్ అవుతోంది.


End of Article

You may also like