మలయాళం సూపర్ హిట్ ‘ప్రేమమ్’ సినిమాతో ఫిలిం ఇండస్ట్రీ లోకి అడుగు పెట్టిన ఈ బ్యూటీ. అ..ఆ తో తెలుగు సినిమాలోకి తెరంగ్రేటంతోనే సూపర్ హిట్ కొట్టింది ఈ మలయాళీ భామ..విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ని అతి కొద్దీ కాలం లోనే సొంతం చేసుకున్న అనుపమా..యూత్ లో భారీ క్రేజ్ ని సంపాదించుకుంది.సోషల్ మీడియా ప్లాటుఫార్మ్స్ అయినా ఫేస్బుక్,ఇంస్ట్గ్రామ్ లలో మిలియన్స్ కొద్దీ ఫాలోయర్స్ ఉన్నారు.

Video Advertisement

ఆమె పెట్టె పోస్ట్ లకి కూడా భారీగా లైక్స్ వస్తుంటాయి.తరచూ ఎదో ఒక వీడియో పోస్ట్ చేస్తూ..అలరించే అనుపమా గత కొద్దీ కాలంగా సోషల్ మీడియా కి దూరంగా ఉన్నారు.దీనితో ఏవేవో రూమర్స్ పుట్టుకొవచ్చాయి..అయితే దేని మీద స్పందించని అనుపమా..తాజాగా తాను ఎందుకు ఆలా దూరంగా ఉండాల్సి వచ్చిందో వివరణ ఇస్తూ.. ఒక వీడియో ని విడుదల చేసారు.ఇంతకీ ఆ వీడియోలో ఏముందంటే..

కొద్ది రోజుల క్రిందటే మూడు కుక్కలను దత్తత తీసుకున్నారు. అనుకోకుండా ‘పార్వోవైరస్’ అనే వైరస్ వలన ఒకొక్కటి మరణిస్తూ వచ్చాయట.డ్డీని గురించి తెలుసుకునే లోపు పరిస్థితి చెయ్యి దాటి పోయిందట.. తాను అడాప్ట్ చేసుకున్న విస్కీ ,రమ్మీ,టోడీ మూడు పెంపుడు జంతువులలో రెండు చనిపోయాయి.ఇప్పుడు తన దగ్గర విస్కీ ఒక్కటే మిగిలి ఉందట అల్లారు ముద్దుగా పెంచుకుంటున్న మూగ జీవాలు చనిపోవటంతో భాధను తట్టుకోలేకపోయాను అంటూ కంట తడి పెట్టుకుంది.