“చిరంజీవి” చేస్తే తప్పు అయినప్పుడు… అదే పని “నాగార్జున” చేస్తే కరెక్ట్ ఎలా అవుతుంది ..?

“చిరంజీవి” చేస్తే తప్పు అయినప్పుడు… అదే పని “నాగార్జున” చేస్తే కరెక్ట్ ఎలా అవుతుంది ..?

by Megha Varna

Ads

నాగార్జున హీరోగా నటించిన ది ఘోస్ట్ సినిమా ఇటీవల విడుదల అయ్యింది. అటు కమర్షియల్ సినిమాలని, ఇటు ప్రయోగాత్మక సినిమాలని సమానంగా బ్యాలెన్స్ చేయడానికి ఎప్పుడు తాపత్రయపడే నటులలో నాగార్జున ఒకరు. ఏ రకమైన పాత్ర అయినా చేయగలను అని నాగర్జున ఇప్పటికే చాలా సినిమాలతో నిరూపించారు.

Video Advertisement

సీనియర్ హీరో అయిన తర్వాత కూడా డిఫరెంట్ పాత్రలు ఎంచుకుంటూ, కొత్త దర్శకులకు అవకాశం ఇస్తూ, ఇప్పటికి కూడా ప్రయోగాత్మక సినిమాలు అంటే ముందు వరుసలో ఉంటున్నారు. నాగార్జున ఆఫీసర్ పాత్ర పోషించడం కొత్త ఏమీ కాదు. కానీ ఈ ఘోస్ట్ సినిమాలో ఒక ఆఫీసర్ కి లవ్ స్టోరీ ఉండటం అనేది కొంచెం కొత్తగా అనిపిస్తుంది. సినిమా ట్రైలర్ చూస్తే మనకి యాక్షన్ సినిమా అని అర్థం అయిపోయి ఉంటుంది.

the ghost movie ott relase update..??

సినిమా మొత్తం యాక్షన్ మీద నడుస్తుంది. అలాగే దాని వెనకాల ఒక ఎమోషన్ కూడా ఉండేలాగా డైరెక్టర్ కథ రాసుకున్నారు. సినిమాలో చెప్పాలనుకున్న పాయింట్ కరెక్ట్ గా ప్రజెంట్ చేశారు. అయితే ఈ మధ్య నాగార్జున కి పెద్దగా హిట్స్ రావడం లేదు. ప్లాపులే ఎక్కువ వస్తున్నాయి. ది ఘోస్ట్ సినిమాకి మిక్స్డ్ రెస్పాన్స్ వస్తోంది. దీనితో నాగార్జున ఇతర స్టార్ హీరోస్ లానే రీమేక్ సినిమాలను తీస్తే బెస్ట్ అని కొందరు అంటున్నారు. అయితే దీనిపై పెద్ద ఎత్తున కామెంట్స్ వస్తున్నాయి. అందుకు కారణం చిరంజీవి ఈ మధ్య రీమేక్ సినిమాలు ఎక్కువగా చేస్తున్నారు. దాంతో ప్రేక్షకులు అందరూ కూడా రీమేక్ సినిమాలు వద్దు అని అంటున్నారు.

godfather movie review

కానీ ఇప్పుడు నాగార్జున ప్రయోగాత్మక సినిమాలు చేస్తుంటే మాత్రం ఇలాంటి సినిమాలు కాదు. మీరు కూడా రీమేక్ సినిమాలు చేయండి. ఎందుకంటే అప్పుడైతే జనాలు చూస్తారు అని అంటున్నారు. దాంతో చాలామంది చిరంజీవి చేస్తే తప్పు అంటున్నారు. నాగార్జున చేస్తే కరెక్ట్ అని ఎలా అంటారు. ఒకవేళ ఇలాగే నాగార్జున రీమేక్ సినిమాలు చేస్తే అప్పుడు నాగార్జునని కూడా ఇలాగే ట్రోల్ చేస్తారు అని అంటున్నారు. కానీ ఏమైనా సరే హీరోలు మాత్రం సోషల్ మీడియాలో జరిగే చర్చలు ఏవి పట్టించుకోకుండా వారికి నటుడిగా సంతృప్తి ఇచ్చే సినిమాలు మాత్రమే చేస్తున్నారు. ఇది నిజంగానే ఒక అభినందించదగ్గ విషయం అని చాలామంది అంటున్నారు.


End of Article

You may also like