Home Filmy Adda Unstoppable with NBK : అన్ స్టాపబుల్ విత్ NBK షో మొదటి ఎపిసోడ్ కు ఆ స్టార్ హీరో ఎందుకు రాలేదు?

Unstoppable with NBK : అన్ స్టాపబుల్ విత్ NBK షో మొదటి ఎపిసోడ్ కు ఆ స్టార్ హీరో ఎందుకు రాలేదు?

by Anudeep

థియేటర్లు మూత పడడం వలన కరోనా లాక్ డౌన్ కాలంలో ఓటిటీల వాడకం మరింత ఎక్కువగా పెరిగింది. మరోవైపు ఓటిటీలు కూడా రకరాల సిరీస్ లు, ప్రోగ్రాంలు, సినిమాలు, టాక్ షోలతో ప్రేక్షకులని ఎంటర్టైన్ చేయడానికి సిద్ధం అవుతున్నాయి. తెలుగు ఓటిటి ఆహ కూడా భిన్నమైన కంటెంట్ తో దూసుకెళ్తున్న సంగతి తెలిసిందే. నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా అన్ స్టాపబుల్ అనే టాక్ షోను ఆహ తీసుకొస్తోంది. ఈ షోలో పలువురు సెలెబ్రిటీలను బాలయ్య బాబు మాట్లాడించనున్నారు.

unstoppable with NBK

ఈ షో లో మొదటి ఎపిసోడ్ కు మెగాస్టార్ చిరంజీవి రాబోతున్నారు అంటూ అప్పట్లో వార్తలు బాగానే వచ్చాయి. అయితే మొదటి ఎపిసోడ్ లో మంచు కుటుంబం హాజరై ఫ్యాన్స్ ను ఎంటర్టైన్ చేసారు. అయితే.. చిరు ఎందుకు రాలేదు? అంటూ పలువురు నెటిజన్లు చర్చించుకుంటున్నారు. మెగాస్టార్ చిరంజీవి వరుసగా సినిమాలను ఒప్పుకోవడంతో బిజీ షెడ్యూల్ లో ఉండి ఉంటారని.. అందుకే ఈ షో కి హాజరు కాలేకపోయి ఉంటారని భావిస్తున్నారు.

You may also like