Ads
హిందూవులు ఎన్నో సంప్రదాయాలను, ఆచారాలను పాటిస్తుంటారు. వాటిలో మరణించినవారిని ఊరేగించడం అనేది ఎప్పటి నుండో ఉన్న సంప్రదాయం. శవయాత్ర నిర్వహిస్తున్న సమయంలో డప్పులు వాయిస్తూ, బాణాసంచా పేల్చుతూ ఘనంగా మరణించిన వారికి ఆఖరిసారిగా వీడ్కోలు పలుకుతుంటారు.
Video Advertisement
అది మాత్రమే కాకుండా చాలా మంది శవయాత్రకు ముందు డ్యాన్స్ చేస్తుంటారు. శవయాత్రలో భాగంగా మరణిచిన వారి పై మరమరాలు చల్లడం, పూలు చల్లడం, డబ్బులు చల్లడం కూడా చేస్తుంటారు. అయితే డబ్బులు శవం పై ఎందుకు చల్లుతారు అనే విషయం చాలామందికి తెలియదు. ఇదే ప్రశ్నని కోరాలో అడుగగా ఒక యూజర్ ఏం చెప్పాడో ఇప్పుడు చూద్దాం.. మరణించిన వారు బ్రతికి ఉన్నప్పుడు ఎంత సంపాదించినప్పటికీ, చనిపోయిన తరువాత వారు ఒక్క రూపాయిని కూడా తీసుకెళ్లలేరు అని చెప్పడానికే ఇలా డబ్బులు చల్లుతారు. రేపు మీ పరిస్థితి కూడా ఇదే కాబట్టి న్యాయంగా, ధర్మంగా జీవించమని చెప్పడానికి కూడా ఇలా చేస్తారని కొందరు చెబుతారు. ఏ ప్రశ్నకైనా జవాబు దొరికే కోరాలో వెంకట రమణ సూరంపూడి అనే యూజర్ “చనిపోయిన వారిని ఊరేగించేటప్పుడు డబ్బులెందుకు చల్లుతారు?” అనే ప్రశ్నకు ఇలా సమాధానం చెప్పారు.
“చనిపోయినవారి అంతిమయాత్రలో డబ్బులు చల్లటం అనేది పది, పదిహేను సంవత్సరాల నుంచే చూస్తున్నాం. ఇలా చల్లిన డబ్బులను ఎక్కువగా యాచకులు, చిన్నపిల్లలు ఏరుకుంటారు. ఈ విధంగా చేస్తే, నిరుపేదలకు మరణించిన వారి పేరు మీదుగా సహాయం చేశామనే తృప్తి వారి కుటుంబసభ్యులకు వుంటుంది. శవ యాత్రలో పూలు, పేలాలు చల్లటం వంటివి చాలా కాలం నుండి వుంది. పూలు చల్లడం అంటే మరణించిన వారిని గౌరవించడం, దేవునిగా భావించడం కావచ్చు. పేలాలు చల్లడం వల్ల పక్షులు, క్రిమి కీటకాలకు ఆహారం వేసినట్టు భావన. ఇవి మనుషులకు కాదు అనడానికి గుర్తుగా ‘ హాస్యబ్రహ్మ ‘ జంధ్యాల గారు ఓ సినిమాలో ” శవం మీద పేలాలు ఏరుకుని తినే మొహం” అంటూ ఓ తిట్టు చేర్చారు!” అని వెంకట్ రమణ సూరంపూడి తెలిపారు.
Also Read: “బేబీ” సినిమా గురించి… ఈ నెటిజన్ పోస్ట్ చూస్తే ఆశ్చర్యపోవాల్సిందే..!
End of Article