Ads
ఎప్పుడో ఏప్రిల్ నెలలో విడుదలైన ఏజెంట్ సినిమా ఇప్పటిదాకా ఓటిటిలో విడుదల కాలేదు. ఈ విషయంపై పలు పుకార్లు షికారులు చేస్తున్నాయి.. ఈ చిత్రానికి సంబంధించి కొన్ని సన్నివేశాలను కొత్తగా ఎడిటింగ్ చేసి, రిలీజ్ కి ముందు కట్ చేసిన కొన్ని సీన్లను జోడించి, అవసరం లేని సన్నివేశాలను తొలగించి న్యూ వెర్షన్ సిద్ధం చేస్తున్నారని అప్పట్లో ప్రచారం జరిగింది.
Video Advertisement
అయితే వీటికి సంబంధించిన వార్తల పై అటువంటిదేమీ జరగడం లేదు అని నిర్మాత అనిల్ సుంకర క్లారిటీ ఇచ్చారు. ఎటువంటి ప్రత్యేకమైన ఎడిటింగ్ కావాలని సోనీ లివ్ సంస్థ అడగలేదని ఇదంతా కేవలం ఒక పుకారని సామజవరగమన సినిమా యొక్క సక్సెస్ ప్రెస్ మీట్ ఆయన తేల్చి చెప్పారు. ఎప్పుడు స్ట్రీమింగ్ చేయాలి అనే తుది నిర్ణయం తమదే అని.. ఇందులో ఎవరు కలగ చేసుకోవాల్సిన అవసరం లేదని ఆయన స్పష్టం చేశారు.
దీన్ని బట్టి ఏజెంట్ ఉన్నది ఉన్నట్టు ఆన్లైన్లో స్ట్రీమింగ్ కి రాబోతోంది అన్న క్లారిటీ వచ్చింది. మరి మూవీకి సంబంధించిన హక్కులను సొంతం చేసుకున్న సోనీ సంస్థ రిలీజ్ కు ఎందుకు ఆలోచిస్తుందో తెలియడం లేదు. పెద్ద పెద్ద బ్లాక్ బస్టర్ సినిమాలే విడుదలైన నలబై రోజులకు ఆన్లైన్లో వచ్చేస్తున్నాయి. మరి ఆల్ టైం డిజాస్టర్ అయిన ఈ చిత్రాన్ని ఆన్లైన్లో స్ట్రీమింగ్ చేయకుండా ఎందుకు ఉన్నారో అంతు చిక్కడం లేదు.
ఇప్పటికే ఏజెంట్ మీద ఎవరికి పెద్ద ఇంట్రెస్ట్ లేదు ఇంకా సాగదీస్తే విడుదల చేసిన ఎవరు ఈ మూవీని పట్టించుకోరు. మరోపక్క అఖిల్ ఈ డిజాస్టర్ గురించి పూర్తిగా మర్చిపోయి హ్యాపీగా విదేశాలలో హాలిడే ఎంజాయ్ చేసి తన నెక్స్ట్ మూవీ కోసం రెడీ అవుతున్నాడట. మరి ఏజెంట్ చిత్రాన్ని ఆన్లైన్లో విడుదల చేస్తారా లేక స్ట్రీమింగ్ ఖర్చులు ఎందుకు వేస్ట్ చేసుకోవడం కొనడమే పెద్ద నష్టమని ఊరుకుంటారా అనేది ప్రస్తుతం ప్రధాన ప్రశ్న.
End of Article