Ads
రాధికా ఆప్టే బాలీవుడ్ నటి అయినప్పటికీ.. తెలుగు వారికి కూడా సుపరిచితురాలు. రామ్ గోపాల్ వర్మ “రక్త చరిత్ర” తో ఆమె తెలుగు తెరకు పరిచయమైంది. “లెజెండ్”, “కబాలి”, “లయన్” వంటి సినిమాల్లో ఆమె నటించారు. ఆ తరువాత ఆమె తెలుగు సినిమాల్లో నటించలేదు. బాలీవుడ్ లో సినిమాలు చేస్తూ వచ్చారు. రాధిక ఆప్టే కమర్షియల్ సినిమాల్లో చాలా తక్కువగా నటిస్తారు.
Video Advertisement
రాధిక ఆప్టే నటించిన వాటిలో ఎక్కువగా కథకి ప్రాధాన్యత ఇచ్చే సినిమాలు తన పాత్రకు ప్రాధాన్యత ఉన్న సినిమాలు మాత్రమే ఉంటాయి. రాధిక ఆప్టే తన ఇన్ని సంవత్సరాల సినిమా కెరియర్ లో నటించిన కమర్షియల్ సినిమాలను వేళ్ళ మీద లెక్కపెట్టవచ్చు. సినిమాల కంటే, ఆమె తన బోల్డ్ కామెంట్స్ తో ఎక్కువ వైరల్ అయ్యారు. పెళ్లి పై ఆమెకు అస్సలు నమ్మకం లేదని అందరికి తెలుసు. కానీ, ఆమె ఎందుకు పెళ్లి చేసుకున్నట్లు? అన్న సందేహం రాక మానదు. అందుకే ఆమె క్లారిటీ గా సమాధానం ఇచ్చేసారు. ఆమె బ్రిటన్ వెళ్ళడానికి వీసా కోసం పెళ్లి చేసుకున్నారట. తన భర్త కు కూడా తాను నచ్చడం తోనే ఈ వివాహం చేసుకోవడం సాధ్యమైందట. ప్రస్తుతం ఆమె భర్త కు దూరంగా ఇండియా లోనే ఉంటున్న సంగతి తెలిసిందే.
Watch Video:
End of Article