“రామ్ చరణ్-ఉపాసన” అంబిలికల్ కార్డ్ రక్తాన్ని ఎందుకు దాచారు..? దానికి ఎంత ఖర్చు అవుతుంది..?

“రామ్ చరణ్-ఉపాసన” అంబిలికల్ కార్డ్ రక్తాన్ని ఎందుకు దాచారు..? దానికి ఎంత ఖర్చు అవుతుంది..?

by kavitha

Ads

మెగాపవర్ స్టార్ రామ్‌చరణ్, ఉపాసన జంటకు ఈ సంవత్సరం (జూన్ 20న) పాప జన్మించిన విషయం తెలిసిందే. ఉపాసన బిడ్డ పుట్టిన తరువాత బొడ్డు తాడు రక్తాన్ని భద్రపరుచుకుంటానని సోషల్ మీడియా ఖాతాలో ఒక వీడియో పోస్ట్ చేసింది. తన బిడ్డ బొడ్డు తాడు రక్తాన్ని ఒక ప్రైవేటు సంస్థ దగ్గర భద్రపరుస్తున్నట్లు ట్వీట్ చేసింది.

Video Advertisement

ఉపాసన లాగానే గతంలో బాలీవుడ్ హీరోయిన్స్ కాజోల్, శిల్పా శెట్టి, సూపర్ స్టార్ మహేశ్ బాబు సతీమణి నమ్రత శిరోద్కర్ తమ పిల్లల బొడ్డు తాడు రక్తం (అంబిలికల్ కార్డ్ బ్లడ్)ని ఈ విధంగానే భద్రపరిచారు. అసలు బొడ్డు తాడు అంటే ఏమిటి? దానిని భద్రపరచడానికి ఎంత ఖర్చు అవుతుందో ఇప్పుడు చూద్దాం..
upasanaబీబీసీ న్యూస్ తెలుగు కథనం ప్రకారం.. తల్లి గర్భంలోని బిడ్డ బొడ్డును ప్లాసెంటాతో బొడ్డు తాడు (అంబిలికల్ కార్డు ) అనుసంధానం అయ్యి ఉంటుంది. గర్భస్థ శిశువుకు అవసరమైన ఆక్సిజన్, గ్లూకోజ్,  పోషకాలు అందేందుకు బొడ్డు తాడు మధ్యవర్తిగా పనిచేస్తుంది. ప్రసవం తరువాత బిడ్డ బయటకు వచ్చినప్పటికీ, బొడ్డు తాడు ప్లసెంటాతో అటాచ్ అయి ఉంటుంది. బిడ్డను ప్లాసెంటా నుండి  వేరు చేయడం కోసం బొడ్డు తాడును కట్ చేసి ముడివేస్తారు. దీనినే బొడ్డు తాడు అంటారు. ఇది 5-15 రోజుల్లో ఎండి,  నల్లపు రంగులోకి మారుతుంది. బొడ్డు తాడు దాని అంతట అదే ఊడిపోతుంది.
ఇక ఈ బొడ్డు తాడు రక్తాన్ని భద్రపరిచే సంస్థలు వేరు ధరలను కలిగి ఉన్నాయి. అయితే బొడ్డు తాడు రక్తాన్ని ఎన్ని సంవత్సరాల పాటు భద్రపరుస్తారనే విషయం కూడా ధరను నిర్ణయిస్తుంది. ఉదాహరణకు 25 సంవత్సరాల పాటు బొడ్డు తాడు రక్తాన్ని భద్రపరచడం కోసం స్టెమ్ సైట్ అనే సంస్థ 55 వేల రూపాయలు తీసుకుంటోంది. ఇక 75 సంవత్సరాల పాటు అయితే, ధర 70 వేల రూపాయలు వరకూ ఉంటుంది. అదనంగా ట్రీట్‌మెంట్ కోసం ఇన్సూరెన్స్ తీసుకునే అవకాశం ఉంది.

ఇంకా చదవండి: నెయ్యి, వెన్న…ఈ ఉత్పత్తులలో ఆరోగ్యానికి ఏది మంచిది.? నిపుణులు ఏం చెప్తున్నారు అంటే..!


End of Article

You may also like