విడుదలకు ముందు ఈ సినిమా టైటిల్స్ ఎందుకు మార్చాల్సివచ్చింది ? ఆ వివాదాలు ఏంటి ?

విడుదలకు ముందు ఈ సినిమా టైటిల్స్ ఎందుకు మార్చాల్సివచ్చింది ? ఆ వివాదాలు ఏంటి ?

by Anudeep

Ads

సినిమాలకు, వివాదాలకు విడదీయరాని బంధం ఉంటుంది. మన టాలీవుడ్ లో సినిమా రిలీజ్ కు ముందు అనేక వివాదాలు నడుస్తుంటాయి. ఒక సినిమాలోని పాత్ర గురించి గాని , కథ గురించి గాని లేదా ఆ సినిమాకు సంబంధించిన  టైటిల్ గురించి గాని అనేక వివాదాలు రావడం మనం ఎన్నోసార్లు వినే ఉంటాం..

Video Advertisement

మరి ఇలాగే సినిమాల మొదటిలో ఒక టైటిల్ అనుకొని వివాదాలు ఏర్పడి టైటిల్ ని మార్చే పరిస్థితి వచ్చిన సినిమాలు మన ఇండస్ట్రీలో ఎన్నో ఉన్నాయి.. మరి ఆ విధంగా సినిమా టైటిల్ మార్చుకున్న సినిమాలు ఏంటో ఇప్పుడు చూద్దాం..

#1 పులి :

మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన పులి చిత్రానికి గాను మొదటిగా కొమరంపులి అని పేరు పెట్టారు. ఈ కొమరం పులి పేరు మీద కొమరం భీమ్ వారసులు కేసు పెట్టగా పులిగా టైటిల్ చేంజ్ చేశారు.

#2. ఖలేజా:

దర్శకుడు త్రివిక్రమ్ మరియు మహేష్ బాబు కాంబినేషన్ లో వచ్చిన ఖలేజా చిత్ర సగం పూర్తి అయిన తర్వాత ఈ టైటిల్ ని నేను ముందుగా రిజిస్టర్ చేయించుకున్నాను అంటూ నిర్మాత విజయభాస్కర్ అడ్డుకట్ట వేశారు. దీనితో ఖలేజా చిత్రాన్ని కాస్త మహేష్ ఖలేజా గా విడుదల చేశారు దర్శక నిర్మాతలు.

#3. కత్తి:

అదే విధంగా కళ్యాణ్ రామ్ నటించిన కత్తి సినిమా గాను కళ్యాణ్ రామ్ కత్తి అని టైటిల్ మార్చారు.

#4. శ్రీదేవి

రాంగోపాల్ వర్మ తీసిన శ్రీదేవి చిత్రాన్ని సావిత్రిగా టైటిల్ మార్చారు. కానీ ఈ సినిమా ఇప్పటి వరకు కూడా విడుదల చెయ్యలేదు.

#5. మిస్టర్ నూకయ్య :

మొదటిగా ఈ చిత్రానికి మిస్టర్ నోకియా అనే పేరు పెట్టగా నోకియా కంపెనీ అభ్యంతరం వ్యక్తం చేయడంతో ఈ చిత్రానికి గాను మిస్టర్ నూకయ్య టైటిల్ చేంజ్ చేశారు.

#6. బెజవాడ :

రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో నాగచైతన్య నటించిన బెజవాడ చిత్రానికి ముందుగా బెజవాడ రౌడీ టైటిల్ పెట్టారు. ఈ టైటిల్ కాస్త వివాదాస్పదంగా మారడంతో రౌడీ తొలగించి బెజవాడగా రిలీజ్ చేశారు.

#7. మసాలా :

విక్టరీ వెంకటేష్ మరియు ఎనర్జిటిక్ హీరో రామ్ కలిసి నటించిన చిత్రం మసాలా.. ఈ చిత్రాన్ని మొదట గోల్ మాల్ అనే టైటిల్ పెట్టగా కొన్ని కారణాల వల్ల ఆ టైటిల్ ను తొలగించి మసాలా అనే పేరుని పెట్టి విడుదల చేయవలసి వచ్చింది.

#8. అర్జున్ సురవరం :

మొదటిగా ఈ చిత్రానికి ముద్ర అనే టైటిల్ ఫిక్స్ చేశారు కానీ కొన్ని కారణాల వల్ల అర్జున్ సురవరం అని మార్చడం జరిగింది.

#9. వంగవీటి :

మొదటిగా ఈ చిత్రానికి వంగవీటి రంగా అని పేరు ఖరారు చేయగా.. ఇది మరీ వివాదాస్పదంగా మారుతుందని రంగా తొలగించి వంగవీటి గా మార్చేశారు.

#10. మెంటల్ పోలీస్ :

శ్రీకాంత్ నటించిన మెంటల్ పోలీస్ అనే చిత్రం వివాదాస్పదంగా చట్టంతో ముందు మెంటల్ తొలగించి పోలీస్ అని టైటిల్ ని మార్చారు.


End of Article

You may also like