“షారుఖ్ ఖాన్, అల్లు అర్జున్” తో పాటు… పెద్ద సెలబ్రిటీస్ అందరికి ఈ “లెగసీ బ్లూ టిక్” సడన్ గా పోవడం వెనుక ఉన్న కథ ఇదేనా ..??

“షారుఖ్ ఖాన్, అల్లు అర్జున్” తో పాటు… పెద్ద సెలబ్రిటీస్ అందరికి ఈ “లెగసీ బ్లూ టిక్” సడన్ గా పోవడం వెనుక ఉన్న కథ ఇదేనా ..??

by Anudeep

Ads

ట్విటర్ బ్లూ టిక్. ప్రస్తుతం ఇదొక ట్రెండింగ్ టాపిక్. ఎందుకంటే దేశంలోని చాలామంది ప్రముఖుల ఐడీలకు ఈ బ్లూటిక్ మాయమైంది. సాధారణంగా ఫేక్ అకౌంట్లను గుర్తించడానికి ఇది సహాయపడేది. కానీ, ప్రస్తుతం ఎవరిది నిజమైన ఐడీనో తెలియని పరిస్థితి ఏర్పడింది. ట్విటర్‌లో ఫేక్‌ ఐడీలు పెరిగిపోవటంతో ఈ బ్లూటిక్‌ కాన్సెప్ట్‌ను తీసుకువచ్చారు.

Video Advertisement

అసలైన అకౌంట్‌కు బ్లూటిక్‌ ఇవ్వటంతో నకిలీ ఖాతాలకు చెక్‌ పడింది. దీని ద్వారానే ప్రముఖులను సులభంగా గుర్తించే అవకాశం లభించింది. అంతకముందు బ్లూటిక్‌ను ఉచితంగానే అందించేవారు. కానీ, ఎలాన్ మస్క్‌ ట్విటర్‌ను కొనుగోలు చేసి బాధ్యతలు చేపట్టిన తర్వాత మార్పులు చేర్పులు చేస్తున్నారు.

why these celebreties twitter accounts official tiks removed..!!

ట్విటర్‌ ఎలాన్‌ మస్క్‌ చేతికి వచ్చిన తరువాత సంస్థలో చాలా మార్పులు చేశాడు మస్క్‌. ఉద్యోగుల దగ్గర్నించి ట్విటర్‌ లోగో వరకూ చాలా విషయాల్లో చేంజెస్‌ చేశాడు. ఒకప్పుడు బ్లూ టిక్‌ను పొందేందుకు ఎకౌంట్‌ వెరిఫై చేసుకోవాల్సి ఉండేది. కానీ ఇప్పుడు సబ్‌స్క్రిప్షన్‌ విధానాన్ని తీసుకువచ్చాడు మస్క్‌. ఇందులో భాగంగా బ్లూటిక్‌ కావాలంటే డబ్బులు చెల్లించాలనే నిబంధన తీసుకువచ్చాడు. ఈ ప్రాసెస్‌తో ట్విటర్‌కు ఇన్‌కం కూడా బాగా పెరుగుతుందనేది మస్క్‌ ప్లాన్‌.

why these celebreties twitter accounts official tiks removed..!!

భారత్‌లో ట్విట్టర్ బ్లూటిక్ సబ్‌స్క్రిప్షన్ కోసం రూ.6,800 చెల్లించాల్సి ఉంటుంది. నెలవారిగా అయితే.. రూ.650 చెల్లించాలి. ప్రస్తుతం ఈ సబ్‌స్క్రిప్షన్ ఛార్జీలు చెల్లించనివారి ఖాతా బ్లూటిక్‌ను ట్విట్టర్ తొలగించింది. ఈ కారణం వల్లే ప్రపంచవ్యాప్తంగా చాలామంది ప్రముఖుల ఖాతాలకు బ్లూటిక్ ఇప్పుడు కనిపించడం లేదు.

why these celebreties twitter accounts official tiks removed..!!

పలువురు రాజకీయ నాయకుల అకౌంట్లకు కూడా బ్లూటిక్ మాయమయ్యింది. రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, యోగీ ఆదిత్యానాథ్ వంటి పలువురు ఖాతాలకు దీన్ని తొలగించారు. అలాగే క్రికెట్, సినిమా అని తేడా లేకుండా ప్రముఖ సెలబ్రిటీల ట్విట్టర్ ఖాతాలకు సంబంధించి బ్లూ టిక్ ను తొలగించేశాడు. ఈ జాబితాలో మహేంద్ర సింగ్ ధోని, విరాట్ కోహ్లీ, సచిన్ టెండూల్కర్, సల్మాన్ ఖాన్, షారుక్ ఖాన్, చిరంజీవి, పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్, రామ్ చరణ్, కాజల్ అగర్వాల్, తమన్నా, పూజా హెగ్డే, రష్మిక, సమంత, నిధి అగర్వాల్, మెహ్రీన్ పిర్జాదా వంటి వారు ఉన్నారు.

why these celebreties twitter accounts official tiks removed..!!

దీంతో బ్లూ టిక్ ఇప్పుడు ట్విట్టర్ లో బాగా ట్రెండ్ అవుతోంది. ‘నా బ్లూ టిక్ మిస్ అవ్వడం చూసా’ అంటూ నిధి అగర్వాల్ ట్వీట్ చేయగా.. ‘బై బై బ్లూ టిక్’ అంటూ మెహ్రీన్ పిర్జాదా ట్వీట్ చేసింది. మరి కొందరు కొందరు సెలబ్రిటీలు ట్విట్టర్ నా బ్లూటిక్ ను తొలగించింది అని అఫీషియల్ గా ట్వీట్లు చేశారు. నటి ఖుష్బూ తాను ట్విట్టర్ బ్లూ టిక్ కోసం పేమెంట్ చేసినా ఇంకా బ్లూ టిక్ యాక్టివేట్ కాలేదని.. ఇలా ఎందుకు అవుతుందో తెలియట్లేదని ట్వీట్లో పేర్కొన్నారు. రాత్రికి రాత్రే బ్లూ టిక్ ను తొలగించడంపై ఆమె అసహనం వ్యక్తం చేశారు.


End of Article

You may also like