రెండు తెలుగు రాష్ట్రాలలో భారీ వర్షాలు బీభత్సాన్ని సృష్టిస్తున్నాయి. ఈ వర్షాలకు వరదలు భారీ స్థాయిలో వస్తుండడంతో గోదావరి పరివాహక ప్రాంతాల్లో నివసించే ప్రజలు తీవ్రమైన ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు.

Video Advertisement

అయితే వైజాగ్ బీచ్ లోని ఇసుక హఠాత్తుగా గురువారం నాడు నల్లగా మారిపోయింది. ఇసుక ఇలా రంగు మారడంతో టూరిస్తులు, స్థానికులు ఆందోళన పడుతున్నారు. సముద్ర తీరంలోని ఇసుక నల్లగా మారిపోవడం హాట్ టాపిక్ గా మారింది. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం..
ఆంధ్రప్రదేశ్ లోని విశాఖలోని ఆర్‌కే బీచ్ లోని ముప్పై ఐదు కిలోమీటర్ల సాగరతీరంలోని ఇసుక ఎప్పుడు బంగారు రంగులో మెరిసిపోతూ టూరిస్తులను, స్థానికులు ఆకర్షిస్తూ ఉంటుంది. అక్కడికి వచ్చి ఇసుకతిన్నెల పై ఎంజాయ్ చేసేవారికి గురువారం నాడు షాక్ తగిలింది. బంగారు వర్ణంలో మెరిసిపోయే ఆర్‌కే బీచ్ లోని ఇసుక ప్రస్తుతం నలుపురంగులో కనిపిస్తుంది. కోస్టల్ బ్యాటరీ మరియు వుడా పార్క్ నడుమ ఉండే సముద్రతీరం నల్లగా మారింది. దాంతో విశాఖ ప్రజలు అక్కడ ఏం జరుగుతుందో అనే భయాందోళనలో మునిగిపోయారు.
ఆర్కే సముద్రతీరంలో బంగారు వర్ణంలోని ఇసుక నల్లగా మారిపోవడం ఎప్పుడూ చూడని విశాఖ ప్రజలు సముద్రతీరానికి వెళ్ళడానికి కూడా భయపడుతున్నారు. స్థానికులు ఈ విషయం గురించి మాట్లాడుతూ ఇసుక నల్లగా మారపోవడం ఇప్పటి దాకా ఎప్పుడు చూడలేదని అంటున్నారు. అయితే ఈ విషయం పై నిపుణులు మాట్లాడుతూ ఇసుకలో ఉన్న లైట్‌ మరియు హెవీ మినరల్స్‌ సపరేట్ కావడం వల్లే ఇసుక నల్లగా మారింది చెబుతున్నారు.
వాతావరణంలోని మార్పుల కారణంగా అలల ఉధృతి పెరిగిన సమయంలో తీరంలో ఉండే లైట్‌ మినరల్స్‌ నీటిలో కలిసి సముద్రంలో కలుస్తాయని, అయితే హెవీ మినరల్స్‌ మాత్రం బీచ్ లోనే ఉండిపోతాయని అంటున్నారు.  హేవిగా ఉండే మినరల్స్‌లో అధికంగా ఇలమనైట్‌, జింకాన్‌, గార్నెట్‌, రుటైల్‌, సిలిమినైట్‌ లాంటివి ఉంటాయని చెబుతున్నారు. ఇసుక నల్లగా మారడానికి ముఖ్యంగా ఇలమనైట్‌, రుటైల్‌ లాంటి బరువున్న మినరల్స్‌ లే కారణం అని నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే ఈ రెండు హెవీ మినరల్స్‌ నల్లని రంగులో ఉంటాయని అందువల్లనే ఇసుక కూడా నల్లగా మారుతుందని చెబుతున్నారు.

Also Read: అసలు “G20 సమ్మిట్” అంటే ఏంటి..? ఇందులో ఏం చర్చిస్తారు..?