అంత పెద్ద ప్రాజెక్ట్ ని యష్ రిజెక్ట్ చేశారా..? అది ఏంటంటే..?

అంత పెద్ద ప్రాజెక్ట్ ని యష్ రిజెక్ట్ చేశారా..? అది ఏంటంటే..?

by Mohana Priya

Ads

కేజీఎఫ్ సినిమాతో అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు సంపాదించుకున్న నటుడు యష్. ఈ సినిమాతో పాన్-ఇండియన్ స్టార్ రేంజ్ కి ఎదిగారు. ఈ సినిమా సెకండ్ పార్ట్ విడుదల ఇచ్చి సంవత్సరమైనా కూడా యష్ ఇప్పటివరకు తన నెక్స్ట్ సినిమా ప్రకటించలేదు.

Video Advertisement

ప్రముఖ డైరెక్టర్ గీతు మోహన్ దాస్ దర్శకత్వంలో నటిస్తారు అని అంటున్నారు. కానీ అందులో ఎంత వరకు నిజం ఉంది అనేది ఇంకా తెలియదు. అయితే ఇదిలా ఉండగా, బాలీవుడ్ లో భారీ ఎత్తున రామాయణం సినిమాని తీద్దాం అని ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమాకి నితీష్ తివారి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో రణబీర్ కపూర్, సాయి పల్లవి హీరో హీరోయిన్లు అని అనుకున్నారు.

కానీ ఇప్పుడు రణబీర్ కపూర్, అలియా భట్ నటిస్తున్నారు అని అంటున్నారు. అయితే ఇందులో రావణుడి పాత్ర కోసం యష్ ని ముందు అనుకున్నారు. దాంతో మళ్లీ తమ అభిమాన హీరోనే తెరపై చూస్తాం అని అభిమానులు అందరూ ఆనందపడ్డారు. అయితే ప్రస్తుతం వస్తున్న వార్తల ప్రకారం యష్ ఈ పాత్రాన్ని తిరస్కరించినట్టు సమాచారం. మరి ఇందులో ఎంత వరకు నిజం ఉంది అనేది ఇంకా తెలియదు. ఏదేమైనా సరే కొంత మంది యష్ ఈ పాత్ర చేయాల్సింది అని అంటే, మరి కొంత మంది ఎంత లేట్ అయినా పరవాలేదు మరొక మంచి సినిమాతో వస్తే చాలు అని అంటున్నారు.

ఎందుకంటే యష్ భారతదేశం అంతటా పాపులర్ అయ్యారు కాబట్టి, నెక్స్ట్ చేసే సినిమా కూడా ఆ ముందు సినిమాల ఇమేజ్ నిలబెట్టేలాగానే ఉండాలి. అందుకే జాగ్రత్తగా మంచి కథ చూసుకొని సినిమా చేయడం కరెక్ట్ అని అంటున్నారు. అయితే ఇదిలా ఉండగా, కేజీఎఫ్ చాప్టర్ 3 వస్తుంది అని ముందే ప్రకటించారు. కానీ ఈ సినిమాకి సంబంధించి ఇంకా ఇటువంటి పని జరగట్లేదు. దాంతో అందరూ అసలు ఈ సినిమాకి ఏం ప్లాన్ చేశారు అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.


End of Article

You may also like