Ads
చిరంజీవి, రామ్ చరణ్ కలిసి తెరపై కనిపిస్తే చూడాలని చాలా మంది ప్రేక్షకులు ఎదురు చూశారు. అంతకుముందు మగధీర సినిమాలో, ఆ తర్వాత బ్రూస్ లీ సినిమాలో చిరంజీవి చిన్న పాత్రలో కనిపించారు. అలా కాకుండా వారిద్దరూ కలిసి ఒక ఫుల్ లెంత్ సినిమాలో నటించాలి అని అందరూ అనుకున్నారు.
Video Advertisement
ఆచార్య సినిమాతో అది జరుగుతుంది అని తెలిసాక అసలు సినిమా ఎలా ఉండబోతోంది? ఇద్దరికీ సమానమైన పాత్రలు ఉంటాయా? అని అనుకున్నారు. కానీ సినిమా విషయానికి వచ్చేటప్పటికీ ప్రేక్షకుల అంచనాలను అందుకోవడానికి చేసిన ప్రయత్నం ఫలించలేదు అని చెప్పాలి.
ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్ గా నటించారు. అయితే గత కొంత కాలం నుండి పూజా హెగ్డే నటించిన సినిమాలు ఆశించిన ఫలితాన్ని ఇవ్వడం లేదు. పూజా హెగ్డే ఇటీవల హీరోయిన్ గా నటించిన రాధే శ్యామ్, అలాగే బీస్ట్ సినిమాలు ప్రేక్షకులని నిరాశపరిచాయి. ఇప్పుడు ఈ సినిమా విషయంలో కూడా అలాగే అయ్యింది. దాంతో ఈ సినిమా ఫ్లాప్ అవ్వడానికి కారణం పూజా హెగ్డే అని అనడం మొదలు పెట్టారు. ఇలా పూజా హెగ్డే విషయంలో మాత్రమే కాదు.
అంతకుముందు శృతి హాసన్ విషయంలో కూడా జరిగింది. శృతి హాసన్ హీరోయిన్ గా నటించిన సినిమాలు కొన్ని ఫ్లాప్ అయ్యాయి. దాంతో “శృతి హాసన్ ఏ సినిమాలో నటిస్తే ఆ సినిమా ఫ్లాప్ అవుతుంది” అని అనడం మొదలు పెట్టారు. చాలా మంది హీరోయిన్ల విషయంలో ఇలా జరిగింది. ఒకవేళ ఆ హీరోయిన్ నటించిన సినిమాలు హిట్ అయితే లక్కీ అని, లేదా ఫ్లాపయితే ఐరన్ లెగ్ అని అంటారు. సినిమాలో వీరు కేవలం నటులు మాత్రమే. డైరెక్టర్ ఎలా చెప్తే అలా మీరు నటిస్తారు.
సినిమా కథ అలాగే సినిమా తెరపై చూపించడం అనే విషయాలు దర్శకుడి చేతిలో ఉంటాయి. ఒక వేళ సినిమా హిట్ అయితే హీరోయిన్ వల్ల హిట్ అయ్యింది అని అనరు. కానీ ఫ్లాప్ అయితే మాత్రం ఇలాంటి పదాలు వస్తూ ఉంటాయి. ఇది కేవలం హీరోయిన్లకే ఎందుకు వర్తిస్తుంది? చాలా మంది హీరోలు కూడా వరుసగా కొన్ని ఫ్లాప్ టాక్ తెచ్చుకున్న సినిమాలు చేశారు. ఆ హీరో ఏ సినిమాలో నటిస్తే ఆ సినిమా ఫ్లాప్ అవుతుంది అని ఎక్కడా అనరు.
ఈ హీరోయిన్స్ ఎక్కువగా కమర్షియల్ సినిమాల్లో నటించారు. కమర్షియల్ సినిమాల్లో హీరోయిన్ పై మాత్రమే కథ ఉండడం అనేది చాలా అరుదు. సినిమా అంతా హీరో మీద నడుస్తుంది. హీరోయిన్ కేవలం సినిమాలో కొంత భాగంలో మాత్రమే కనిపిస్తారు. అలాంటప్పుడు సినిమా ఫ్లాప్ అయితే హీరోయిన్లని అనడం ఎంతవరకు కరెక్ట్? దర్శకుడు చెప్పినట్టు నటించిన హీరోయిన్ ఏం తప్పు చేసింది? అసలు ఇలాంటివన్నీ ఎక్కడ నుండి మొదలు అవుతున్నాయి? ఇవన్నీ మనకే తెలియాలి.
End of Article