Ads
ఎన్నో రోజులు ఎదురు చూసిన తర్వాత మహేష్ బాబు నటించిన సర్కారు వారి పాట సినిమా విడుదల అయ్యింది. ఎప్పుడో విడుదల కావాల్సి ఉన్న ఈ సినిమా కోవిడ్ కారణంగా వాయిదా పడింది.
Video Advertisement
ఈ సినిమాకి ప్రస్తుతం మిక్స్‌డ్ టాక్ వస్తోంది. కొంత మంది, “మహేష్ బాబు ఈ సినిమాలో చాలా బాగా నటించారు, చాలా కొత్తగా కనిపించారు” అని అంటూ ఉంటే, ఇంకొంతమంది, “కథలో కొత్తదనం లేదు” అంటున్నారు. ఇదిలా ఉండగా, ప్రస్తుతం ఒక వార్త ప్రచారంలో ఉంది. అదేంటంటే టికెట్ల ధరపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డితో మాట్లాడడానికి అంతకుముందు మహేష్ బాబు, డైరెక్టర్ రాజమౌళి, చిరంజీవి, ప్రభాస్ వెళ్లారు.
వీరితో పాటు ప్రముఖ నటుడు ఆర్.నారాయణమూర్తి కూడా వెళ్లారు. అయితే చిరంజీవి నటించిన ఆచార్య, ప్రభాస్ నటించిన రాధే శ్యామ్ సినిమాలు ప్రేక్షకుల అంచనాలని అందుకోలేకపోయాయి. ఇప్పుడు సర్కారు వారి పాట సినిమాకి కూడా డివైడ్ టాక్ వస్తోంది. దాంతో జగన్ ని కలిసిన సినిమాల రిజల్ట్ ఇలా ఉంది అంటూ ఒక వార్త ప్రచారంలో ఉంది. కానీ ఇలా అనడం ఎంతవరకు కరెక్ట్? అలా అనుకుంటే ఆర్ఆర్ఆర్ సినిమా గురించి మాట్లాడడానికి రాజమౌళి కూడా వారితో పాటు వెళ్లారు. మరి ఆ సినిమా రిజల్ట్ ఎలా ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
సినిమా రిజల్ట్ అటు ఇటు అయితే వేరే వారిని అనడం ఇది మొదటిసారి జరగలేదు. అంతకుముందు హీరోయిన్ల విషయంలో కూడా ఇలాగే జరిగింది. కథలో అలాగే ఒక సినిమా మేకింగ్ లో ముఖ్యపాత్ర పోషించే దర్శకుడిని లేదా ఆ సినిమాకి సంబంధించిన వారికి కాకుండా కేవలం సినిమాలో నటించే హీరోయిన్లని ఒక సినిమా ఫ్లాప్ టాక్ కి కారణం అని అన్నారు. ఇంతకుముందు ఆచార్య, రాధే శ్యామ్, బీస్ట్ నెగిటివ్ టాక్ రావడం విషయంలో పూజా హెగ్డేని, అలాగే గతంలో కొన్ని సినిమాలకు శృతి హాసన్ ని అని కూడా ఇలాగే ట్రోల్ చేశారు.
ఈ సినిమాలు అన్నీ కూడా ఎప్పటినుండో విడుదల కావడానికి సిద్ధంగా ఉన్నాయి. జగన్ మోహన్ రెడ్డిని కలిసిన అంతమాత్రాన సినిమా రిజల్ట్ మారిపోతుంది అని అనడం ఎంతవరకు కరెక్ట్? ఇందులో ఆయన చేసింది ఏముంది? సినిమాకి సంబంధించిన వారు కూడా సినిమా రిజల్ట్ విషయంలో ఏదైనా జరిగితే వారి తప్పు అని ఒప్పుకుంటారు. కానీ చూసే ప్రేక్షకులు మాత్రం ఒకవేళ ఏదైనా సినిమా రిజల్ట్ తేడా వస్తే అసలు ఆ సినిమాకి సంబంధం లేని వారిని, లేదా ఆ సినిమాలో ఏదో ఒక పాత్ర పోషించిన వారిని అనడం చేస్తున్నారు. ఇలా చేయడం ఎంతవరకూ సరైనది అనేది మనకి మాత్రమే తెలియాలి.
End of Article