Ads
సీనియర్ హీరోయిన్ జమున వయో భారం తో పాటు గుండెపోటు రావడం తో శుక్రవారం హైదరాబాద్ లో మరణించిన విషయం తెలిసిందే. ఆమెకు 86 ఏళ్ళు. తెలుగు సహా ఇతర దక్షిణాది భాషల్లో సుమారు 198 చిత్రాల్లో జమున నటించారు. జమున భౌతిక కాయాన్ని అభిమానుల సందర్శనార్థం సాయంత్రం నాలుగు గంటల వరకు ఫిలింఛాంబర్‌లో ఉంచారు. ఆ తర్వాత భారీ అభిమాన జన సందోహం మధ్య భౌతికకాయాన్ని మహాప్రస్థానానికి తరలించారు. మహాప్రస్థానం లో జమున కుమార్తె స్రవంతి రావు ఆమెకు అంత్యక్రియలు చేసారు. దీంతో అందరికి ఈ అంశంపై ఆసక్తి పెరిగింది.
Video Advertisement
సాధారణంగా కుమారులు లేని వారు మరణించిన తర్వాత వారి కుమార్తెలు అంత్యక్రియలు చేయడం మనం చూస్తున్నాం. కానీ సినీ నటి జమునకి కుమారుడు వంశీకృష్ణ ఉండగా కుమార్తె ఎందుకు అంత్యక్రియలు చేశారన్న సందేహం అందరిలోనూ మెదిలింది. దీంతో వారి బంధువులు ఈ విషయం పై స్పందించారు. కుమారుడు వంశి కృష్ణ రావడానికి ఆలస్యం కానుండటం తో తన సోదరిని అంత్యక్రియలు చేయమన్నారని వారి బంధువులు వెల్లడించారు.
జమున ప్రొఫెసర్ జూలూరి రమణారావును పెళ్లి చేసుకున్నారు. వీరి వివాహం 1965లో తిరుపతిలో జరిగింది. ఈ దంపతులకు కుమారుడు వంశీకృష్ణ, కుమార్తె స్రవంతి ఉన్నారు. వంశీకృష్ణ అమెరికాలోని శాన్ ఫ్రాన్సిస్కోలో ఓ యూనివర్సిటీలో ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు. ఆయన తన భార్య, కుమారుడితో అక్కడే స్థిరపడ్డారు. స్రవంతి రావు తన కుమారుడితో కలిసి హైదరాబాద్‌లో ఉంటున్నారు. జమున భర్త జూలూరు రమణారావు 2014లో కన్నుమూయడంతో జమున మరణించే వరకు తన కుమార్తె వద్దే ఉన్నారు.
జమున శుక్రవారం ఉదయం ఆకస్మికంగా కన్నుమూయడంతో.. అమెరికాలో స్థిరపడ్డ కుమారుడు జూలూరి వంశీకృష్ణకు అప్పటికప్పుడు హైదరాబాద్‌కు బయల్దేరి రావడం కుదరలేదు. ఆలస్యం అవుతుందని భావించి తన సోదరితో అంత్యక్రియలు జరపాల్సిందిగా కోరినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ఇన్నీ రోజులు తన తల్లిని అన్నీ తానై చూసుకున్న స్రవంతి తన చేతుల మీదుగానే ఆమెకు అంతిమ సంస్కారాలు నిర్వహించారు.
End of Article