Home Filmy Adda “పవన్ కళ్యాణ్” బర్త్ డే రోజు… “జాతి రత్నాలు” ఎందుకు ట్రెండ్ అయ్యింది..? కారణం ఇదేనా..?

“పవన్ కళ్యాణ్” బర్త్ డే రోజు… “జాతి రత్నాలు” ఎందుకు ట్రెండ్ అయ్యింది..? కారణం ఇదేనా..?

by Anudeep

ఈ మధ్య తమ అభిమాన హీరోల పుట్టినరోజులు సందర్భంగా వారి సూపర్ హిట్ సినిమాలను రీ రిలీజ్ చేయడం పరిపాటిగా మారింది. తాజాగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బర్త్డే సందర్భంగా తమ్ముడు, జల్సా సినిమాలను విడుదల చేసేందుకు నిర్ణయించుకున్నారు.

ఇప్పటికే తమ్ముడు సినిమా పలు థియేటర్లలో విడుదల కాగా, జల్సా మూవీని తెలుగు రాష్ట్రాలతో పాటు అమెరికాలో కూడా విడుదల చేసేందుకు అభిమానులు భారీఎత్తున సన్నాహకాలు చేస్తున్నారు.

A comedy scene from jathiratnalu is going viral on jalsa re release
పవన్ బర్త్ డే సందర్భంగా పవన్ అభిమానులకు పండుగ వాతావరణం నెలకొంది. ఈ నేపథ్యంలో జాతిరత్నాలు సినిమాలోని ఓ సన్నివేశం నెట్టింట్లో వైరల్ అవుతోంది. నవీన్ పోలిశెట్టి హీరోగా నటించిన జాతిరత్నాలు సినిమాలోని ఓ సన్నివేశంలో హీరో తన స్నేహితులతో మాట్లాడేటపుడు నేను మిమ్మల్ని పైకి తీసుకొచ్చారా .. అంటాడు.. అప్పుడు రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి నువ్వు మమ్మల్ని ఎం తీసుకొచ్చావ్ రా అని కోపంతో అంటారు. అప్పుడు హీరో “అప్పుడు 2008 సంవత్సరం , మార్చి 27 ..జల్సా సినిమా రిలీజ్, నటరాజ్ థియేటర్..సంగారెడ్డి.. ఆ రోజు మీరు కింద ఉన్నారు నేను బాల్కనీలో ఉన్నారు.. అప్పుడు నేను మిమ్మల్ని పైకి తీసుకురాలేదారా..” అంటాడు.

A comedy scene from jathiratnalu is going viral on jalsa re release
జల్సా రీ రిలీజ్ సందర్భంగా ఈ కామెడీ సన్నివేశం ప్రస్తుతం ఇంటర్నెట్ లో వైరల్ అవుతోంది. తమ అభిమాన హీరో పుట్టినరోజు సందర్భంగా జల్సా సినిమాకు సంబంధించిన ప్రతి దాని అభిమానులు వైరల్ చేస్తూ సంబరాలు చేసుకుంటున్నారు. హీరో నవీన్ పోలిశెట్టి ఈ కామెడీ వీడియోని షేర్ చేయడంతో మరింతమంది ఈ వీడియో ని చూసి నవ్వుకుంటున్నారు. “టికెట్స్ కావాలంటే చెప్పండి.. నేను మిమ్మల్ని పైకి తీసుకొస్తాను” అని కాప్షన్ పెట్టి నవీనపోలిశెట్టి ఈ వీడియోని షేర్ చేసారు.

You may also like