కీరవాణి-రాజమౌళి అన్నదమ్ములు…! కానీ ఒకరికి MM మరొకరికి SS… ఎందుకలా?

కీరవాణి-రాజమౌళి అన్నదమ్ములు…! కానీ ఒకరికి MM మరొకరికి SS… ఎందుకలా?

by Sainath Gopi

Ads

MM keravani : రాజమౌళి కీరవాణి బంధువులు అన్న విషయం అందరికి తెలిసిందే. కానీ ఇద్దరి ఇనిషియల్స్ వేరే ఉంటాయి. రాజమౌళి పేరుకు ముందు SS ఉంటుంది. కీరవాణి పేరుకు ముందు MM అని ఉంటుంది.

Video Advertisement

సరే ఒకే కుటుంబమైనా ఒకసారి ఇంటి పేర్లు మారుతాయి కదా అని మీరు అనుకుంటూ ఉండొచ్చు. కానీ రాజమౌళి తండ్రి విజయేంద్రప్రసాద్ పేరుకు ముందు KV ఉంటుంది.

ఈ కన్ఫ్యూషన్ ఏంటి అసలు వాళ్ల ఇంటి పేరు ఏంటి అని అని అనుమానం రావచ్చు. వాళ్ల ఇంటి పేరు కోడూరి. వాళ్ల కుటుంబం లో మొదటి సోదరుడు కోడూరి రామారావు, తర్వాత కోడూరి శివశక్తి దత్తా, ఆయన తర్వాత కోడూరి కాశి. కోడూరి శివశక్తి దత్తా కీరవాణి కి తండ్రి. ఆయన చంద్రహాస్ సినిమా కి దర్శకత్వం వహించారు.

కీరవాణి కి ఇంకో సోదరుడు ఉన్నారు. ఆయనే కళ్యాణ్ మాలిక్. కోడూరి కాశీ కీరవాణి ని సంగీత దర్శకుడు చక్రికి పరిచయం చేశారు. అలా కీరవాణికి మొదటి అవకాశం లభించింది. కళ్యాణ్ మాలిక్ కూడా ఎన్నో సినిమాలకు సంగీత దర్శకత్వం వహించారు. ఐతే, ఊహలు గుసగుసలాడే సినిమాలకు సంగీత దర్శకత్వం వహించడంతో పాటు బాహుబలి కి నేపథ్య సంగీతం అందించారు.

తర్వాత సోదరుడు కోడూరి విజయేంద్రప్రసాద్. కోడూరి రామకృష్ణ ఆ కుటుంబంలో చివరి సోదరుడు. వాళ్ళందరికీ ఒక సోదరి ఉన్నారు. రాజమౌళి తండ్రి విజయేంద్రప్రసాద్. ఆయన ఎన్నో సినిమాలకి దర్శకత్వం వహించారు, మెర్సల్ (తెలుగులో అదిరింది), భజరంగీ భాయిజాన్, మణికర్ణిక, తలైవి సినిమాలకు కథను అందించారు. అంతేకాకుండా రాజమౌళి దర్శకత్వం వహించిన చాలా సినిమాలకి కథాసహకారం చేశారు, భారతదేశం మొత్తం ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన ఆర్ ఆర్ ఆర్ సినిమాకి కూడా కథను అందించారు.

రాజమౌళి పూర్తి పేరు శ్రీశైల శ్రీ రాజమౌళి. ఎస్ ఎస్ అక్షరాలకి అర్థం ఇదే. కీరవాణి పూర్తి పేరు మరకతమణి కీరవాణి. ఆయన పేరు లో ఉండే ఎం ఎం అక్షరాలు మరకతమణి ని సూచిస్తాయి. వాళ్ళ కుటుంబంలో ఇంటిపేరు ఉపయోగించింది కళ్యాణ్ మాలిక్ ఒక్కరే. ముందు ఆయన పేరు కళ్యాణ్ మాలిక్ అని ఉండేది. తర్వాత కల్యాణి కోడూరి అని మార్చుకున్నారు.

ఎం ఎం శ్రీలేఖ కీరవాణి కి చెల్లెలు అవుతారు. శ్రీలేఖ కూడా అదిరిందయ్యా చంద్రం, ఆపరేషన్ దుర్యోధన వంటి సినిమాలకు సంగీత దర్శకత్వం వహించారు. శ్రీలేఖ పూర్తి పేరు మణిమేఖల శ్రీలేఖ. ఆవిడ కూడా తన ఇంటి పేరును స్క్రీన్ నేమ్ గా పెట్టుకోలేదు.

యమదొంగ లో ఎన్టీఆర్ చిన్నప్పటి పాత్రలో నటించిన సింహ కోడూరి మత్తు వదలరా సినిమా తో హీరోగా పరిచయమయ్యాడు. అతను ఎవరో కాదు కీరవాణి కొడుకు. సింహ కూడా స్క్రీన్ నేమ్ లో ఇంటి పేరుని పెట్టుకున్నారు. ఇప్పుడు అర్థమైందా వాళ్లంతా ఒకే కుటుంబానికి చెందిన వారు అయినా అలా వేరు వేరు ఇనిషియల్స్ ఎందుకు ఉన్నాయో?

Also read: Tollywood Top Heros Houses Images


End of Article

You may also like