Home Filmy Adda 60 ఏళ్ళు వచ్చినా కోవై సరళ పెళ్ళెందుకు చేసుకోలేదు .. వారి కోసమే అంత త్యాగం చేసారా..? అసలేమైంది..?

60 ఏళ్ళు వచ్చినా కోవై సరళ పెళ్ళెందుకు చేసుకోలేదు .. వారి కోసమే అంత త్యాగం చేసారా..? అసలేమైంది..?

by Anudeep

తెలుగు ఇండస్ట్రీలో కమెడియన్లకు కొదవ లేదు. కమెడియన్ అనగానే బ్రహ్మానందాన్నో, అలీనో తలుచుకుని మురిసిపోతున్న రోజుల్లోనే లేడీ కమెడియన్ గా కెరీర్ ప్రారంభించి సత్తా చాటారు కోవై సరళ. బ్రహ్మానందానికి జోడిగా చాలా సినిమాల్లో కనిపించి మెప్పించారు. వీరిద్దరి జోడిలో కామెడీ చాలా బాగా పండేది.

అయితే.. రియల్ లైఫ్ లో మాత్రం కోవై సరళకు జోడి అంటూ ఎవరూ లేరు. చాలా మందికి కోవై సరళ పెళ్లి చేసుకోలేదన్న విషయం తెలుసు. కానీ ఎందుకు పెళ్లి చేసుకోలేదు అన్న సంగతి మాత్రం తెలియదు.

kovai sarala

60 ఏళ్ళు వస్తున్నా కోవై సరళ పెళ్లి చేసుకోకుండా సినిమాలకే తన కెరీర్ ను అంకితం చేసారు. ఇప్పటివరకు ఆమె 800 లకు పైగా సినిమాలలో నటించారు. నువ్వే కావాలి సినిమా టైం లో ఆమె కామెడీ టైమింగ్ ప్రేక్షకులను ఎంతగానో మెప్పించింది. ఆ తరువాత ఎప్పుడూ ఆమె వెను తిరిగి చూడాల్సిన అవసరం రాలేదు. ఆమెకు ఫాలోయింగ్ కూడా ఎక్కువే ఉండడంతో వరుస సినిమాలతో బిజీగా ఉండేది.

kovai sarala 1

మొదట్లో కోవై సరళ వాయిస్ విని ఆమెకు సినిమాలలో అవకాశం ఇచ్చేవారు కాదట. కానీ, ఆ తరువాత ఆమెకు ఆ వాయిస్ ప్లస్ అయ్యింది. చాలా అవకాశాలు తెచ్చిపెట్టింది. ప్రస్తుతం 59 సంవత్సరాల వయసు ఉన్న కోవై సరళ పెళ్లి మాత్రం చేసుకోలేదు. అవకాశాలు తగ్గినప్పటికీ.. నిన్న మొన్నటి వరకూ ఆమె సినిమాల్లో కనిపిస్తూనే వచ్చారు. ఆమెకు ఉన్న బాధ్యతల కారణంగానే కోవై సరళ పెళ్లి చేసుకోకుండా సినిమా రంగంలో రాణించారట.

kovai sarala 2

కుటుంబం ఆర్ధికంగా వెనుకబడి ఉండడంతో.. తన నలుగురు చెల్లెళ్ళ బాధ్యతను తానె తీసుకుందట. వాళ్ళ కోసం తన జీవితాన్ని త్యాగం చేసి తాను పెళ్లి చేసుకోకుండానే ఉండిపోయిందట. ఆ తరువాత తన సంపాదనతో వారి బాగోగులు చూసుకున్నా.. తాను మాత్రం ఒంటరిగా మిగిలిపోయింది. పెళ్లి చేసుకోకపోయినా కోవై సరళ సామాజిక కార్యక్రమాలలో ఆక్టివ్ గా పాలు పంచుకుంటారట.

You may also like