Home News లతా మంగేష్కర్ ఎందుకు పెళ్లి చేసుకోలేదు..? తన పెళ్లి గురించి లత ఏమన్నారో తెలుసా..?

లతా మంగేష్కర్ ఎందుకు పెళ్లి చేసుకోలేదు..? తన పెళ్లి గురించి లత ఏమన్నారో తెలుసా..?

by Anudeep

లతా మంగేష్కర్ ఇటీవలే ఈ లోకాన్ని వీడి వెళ్లారన్న వార్తని అభిమానులు ఇంకా జీర్ణం చేసుకోలేకపోతున్నారు. 92 ఏళ్ల లతా మంగేష్కర్ అనారోగ్యంతో నిన్న మృతి చెందిన సంగతి విదితమే. మరో వైపు అధికార లాంఛనాలతో ఆమె అంత్యక్రియలు జరుగుతున్నాయి.

ఆమె అంత్యక్రియలకు ప్రధాని మోడీ తో సహా పలువురు సినీ ప్రముఖులు కూడా హాజరు అవుతున్నారు. ఇది ఇలా ఉంటె.. ఇప్పటివరకు లతా మంగేష్కర్ పెళ్లి చేసుకోలేదు.

latha mangeshkar

latha mangeshkar

ఫిబ్రవరి 6 వ తేదీన మృతి చెందిన లతా మంగేష్కర్ కు 92 ఏళ్ల వయసు వచ్చింది. ఆమె వయసులో ఉండగా పెళ్లి అన్న మాటకే తావివ్వలేదు. అయితే.. ఆమె ఎందుకు పెళ్లి చేసుకోలేదన్న సందేహం మాత్రం చాలా మంది అభిమానుల్లో ఉండిపోయింది. ఆమె సినీ ఇండస్ట్రీ లో దాదాపు 80 ఏళ్లపాటు కొనసాగింది. కానీ, ఇన్నేళ్ళలో ఆమె పై ఒక్క రూమర్ కూడా రాలేదు.

latha mangeshkar

latha mangeshkar

ఇలాంటి విశేషాలు లతాజీ జీవితంలో చాలానే ఉన్నాయి. అలా రూమర్స్ రాకుండా.. లతాజీ చాలా పద్ధతిగా తన జీవితాన్ని ముగించారు. ఈమె వ్యక్తిగత జీవితంలో ప్రేమ వల్లనే పెళ్లి చేసుకోలేదు అన్న మాటలు అక్కడక్కడా వినిపించినా ఆమె తన మౌనాన్ని వీడలేదు. అయితే చివరగా ఆమె ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ప్రేమ, పెళ్లి, పిల్లల గురించి తన అభిప్రాయాన్ని వెలిబుచ్చారు.

latha mangeshkar

latha mangeshkar

హృదయానికి మాత్రమే తెలిస్తే చాలు అనుకునే విషయాలను నేను అలానే ఉంచాలనుకుంటున్నా అని ఆమె సమాధానం చెప్పారు. పెళ్లి, పిల్లలు ఉంటేనే స్త్రీ జీవితం సంపూర్ణం అవుతుందని భావిస్తే.. దానిని తాను పట్టించుకోనని లతా చెప్పుకొచ్చారు. ప్రజలు అన్ని రకాల విషయాలను మాట్లాడతారని, వాటిని పట్టించుకుంటే జీవితాన్ని సంతోషంగా గడపలేమని లతా చెప్పుకొచ్చారు. తనకు మనిషి లోపల ఉండే సంతోషమే ముఖ్యమని, పెళ్లి, పిల్లలు లాంటి బహిరంగ సంతోషాల కోసం పాకులాడలేనని చెప్పుకొచ్చారు. చివరివరకు ఆమె అదే మాటపై నిలబడ్డారు.

You may also like