Ads
లవ్ స్టోరీ సినిమా మంచి ఫలితాలు రాబట్టడం తో దర్శకుడు శేఖర్ కమ్ముల ఫుల్ ఖుషి లో ఉన్నారు. అయితే.. శేఖర్ కమ్ముల సింప్లిసిటీ గురించి ఇండస్ట్రీ మొత్తం తెలుసు. మంచి జాబ్ ని వదులుకుని ఇండస్ట్రీ లోనే సెటిల్ అవ్వాలి అనే ఉద్దేశం తో శేఖర్ కమ్ముల ఇండస్ట్రీ కి వచ్చారు. ఫిదా సినిమా తరువాతే శేఖర్ కమ్ముల కొంత నిలదొక్కుకున్నారు.
Video Advertisement
ఏ మాత్రం నిలదొక్కుకున్న సినీ సెలెబ్రిటీలు బంజారాహిల్స్ కి మకాం మార్చేస్తూ ఉంటారు. కానీ, శేఖర్ కమ్ముల మాత్రం ఇప్పటికీ పద్మారావు నగర్ లోని తన ఇంట్లోనే హ్యాపీ గా మధ్య తరగతి జీవనాన్ని ఆస్వాదిస్తూ ఉన్నారు. అయితే.. ఆయన తరచుగా హైదరాబాద్ బోర్డర్ లో ఉండే ప్రత్యేకమైన బంగ్లా కి వెళ్తూ ఉంటారు. ఈ బంగ్లా ఆయనదే అని, దాదాపు డెబ్భై కోట్ల ఖరీదు ఉండొచ్చని ఫిలిం వర్గాల్లో టాక్ వినిపించేది.
అయితే.. ఈ రూమర్స్ పై శేఖర్ కమ్ముల ఎప్పుడు స్పందించలేదు. ఇటీవల లవ్ స్టోరీ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా.. ఓ ఇంటర్వ్యూ లో శేఖర్ కమ్ముల ఈ బంగ్లా గురించి చెప్పారు. ఈ బంగ్లా తనది కాదని, తన సన్నిహితుడిది అని స్పష్టత ఇచ్చారు. అది ప్రస్తుతం ఖాళీ గానే ఉందని.. కేవలం సరదా కోసమే అప్పుడప్పుడు తాను కూడా వెళ్తూ ఉంటానని చెప్పుకొచ్చారు. అదన్నమాట బంగ్లా వెనక సంగతి.
End of Article