అలా జరిగాక.. మహేష్ బాబు KBR పార్క్ వైపే వెళ్లలేదట.. ఎందుకో తెలుసా..?

అలా జరిగాక.. మహేష్ బాబు KBR పార్క్ వైపే వెళ్లలేదట.. ఎందుకో తెలుసా..?

by Anudeep

Ads

థియేటర్లు మూత పడడం వలన కరోనా లాక్ డౌన్ కాలంలో ఓటీటీల వాడకం మరింత ఎక్కువగా పెరిగింది. మరోవైపు ఓటీటీలు కూడా రకరాల సిరీస్ లు, ప్రోగ్రాంలు, సినిమాలు, టాక్ షోలతో ప్రేక్షకులని ఎంటర్టైన్ చేయడానికి సిద్ధం అవుతున్నాయి.

Video Advertisement

తెలుగు ఓటిటి ఆహ కూడా భిన్నమైన కంటెంట్ తో దూసుకెళ్తున్న సంగతి తెలిసిందే. నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా అన్ స్టాపబుల్ అనే టాక్ షోను ఆహ తీసుకొచ్చింది.

kbr park 1

ఈ షో టాప్ రేటింగ్స్ తో దూసుకెళ్ళిపోతోంది. బాలకృష్ణ చాలా ఎనర్జిటిక్ గా కనిపిస్తున్నారు. ఆయన ఈ షో కి హోస్ట్ గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. షో కి వచ్చే పలువురు సెలెబ్రిటీలను బాలయ్య ఇంటర్వ్యూ చేస్తూ ఉంటారు. ఇప్పటికే ఈ షో కి మంచు ఫ్యామిలీ, రవి తేజ, ఆర్ ఆర్ ఆర్ టీం, నాని, ఇంకా చాలా మంది సెలెబ్రిటీలు వచ్చి ఎంటర్టైన్ చేసిన సంగతి తెలిసిందే.

kbr park 2

తాజాగా.. ఈ షో కి సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా వచ్చారు. ఆయన షో తాలూకు ప్రోమో ఇటీవలే విడుదల అయింది. ఇందులో మహేష్ బాబు కేబీఆర్ పార్క్ తో తన అనుభవం గురించి చెప్పుకొచ్చారు. ఓసారి.. కేబీఆర్ పార్క్ కి వెళ్ళినప్పుడు ఒక రౌండ్ తిరగడం అయిపోయి.. రెండవ రౌండ్ కి వెళ్తున్న టైం లో ఓ చోట ఏదో కదులుతున్నట్లు కనిపించిందట. ఏంటా అని దగ్గరికెళ్లి చూస్తే.. అది పాము. సడన్ గా పాము కనిపించేసరికి మహేష్ బాబు ఐదు కిలోమీటర్లు వెనక్కి పరిగెత్తి వెళ్లిపోయారట. తిరిగి ఎప్పుడు కేబీఆర్ పార్క్ వైపు వెళ్లలేదట.

Watch Video:


End of Article

You may also like