Ads
సూపర్ స్టార్ మహేష్ బాబుకి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మహేష్ బాబు మన రెండు తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే కాకుండా ఇతర రాష్ట్రాల్లో కూడా చాలా గుర్తింపు పొందారు. స్పైడర్ సినిమాతో డైరెక్ట్ తమిళ్ సినిమాలో కూడా నటించారు. ఈ సినిమా తెలుగు, తమిళ్ భాషలో రూపొందింది. మహేష్ బాబు సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటారు. తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాలని చాలా తక్కువగా షేర్ చేస్తారు.
Video Advertisement
అయితే మహేష్ బాబు అంటే సాధారణంగా చాలా బాగుంటారు అని ఎంతోమంది అంటూ ఉంటారు. ఇలాంటి ఎన్నో జాబితాల్లో మహేష్ బాబు చోటు సంపాదించుకున్నారు. మహేష్ బాబు మంచి నటుడు మాత్రమే కాకుండా చూడడానికి కూడా చాలా బాగుంటారు అనే పేరు గుర్తింపు దక్కించుకున్నారు. అయితే మహేష్ బాబు అప్పటికీ, ఇప్పటికీ ఒకేలాగా ఉన్నారు అని కూడా చాలామంది అంటూ ఉంటారు. ఇదే ప్రశ్నని కోరాలో ఒక యూజర్ అడిగారు. అందుకు ఒకరు, “మహేష్ బాబు ఎప్పుడు యంగ్ గా ఎలా ఉంటారు?” అనే ప్రశ్నకు ఈ విధంగా సమాధానం చెప్పారు.
#1 మహేష్ బాబు ప్రతిరోజు రెండు గంటలు వ్యాయామం చేస్తారు. రోజుకి 7 సార్లు తక్కువ పరిణామంలో కేవలం విటమిన్లు, ప్రోటీన్లు ఉండే భోజనం మాత్రమే తింటారు.
#2 ధూమపానంకి దూరంగా ఉంటారు. అలాగే మందు కూడా మానేశారు. అందుకే తన సినిమాల్లో కూడా ఎవరికి చెడు సందేశం ఇవ్వద్దు అని ఉద్దేశంతో మద్యపానం, ధూమపానం లాంటి సీన్స్ ఎంత తక్కువ వీలైతే అంత తక్కువగా చేస్తుంటారు.
#3 కుటుంబం ప్రతి ఒక మనిషికి బలం అని అంటారు. మహేష్ బాబు తన కుటుంబంతో ఎంత ఎక్కువ వీలైతే అంత ఎక్కువ సమయం గడుపుతూ ఉంటారు. వారిని తీసుకొని ఎక్కడికైనా వెళ్లడం, వారితో సరదాగా సమయం గడపడం, అలాగే తన సినిమా షూటింగ్ లకి కూడా వారిని తీసుకురావడం చేస్తుంటారు. ఎంత బిజీగా ఉన్నా కూడా కుటుంబానికి మాత్రం ఎంతో ప్రాముఖ్యత ఇస్తారు అని అర్థం అయిపోతుంది. అందుకే ఒత్తిడి నుండి కూడా దూరంగా ఉంటారు.
#4 అన్నిటికంటే ముఖ్యమైన విషయం మహేష్ బాబు స్వతహాగానే అందగాడు. ఎంతోమంది, “హాలీవుడ్ హీరోలా ఉన్నారు” అని అంటూ ఉంటారు. మహేష్ బాబుకి సినిమా తప్ప మరొక ప్రపంచం తెలియదు. తను చేసే పనిపై పూర్తి శ్రద్ధ పెట్టి చేస్తారు. అందుకే ఎన్నో ఇంటర్వ్యూలలో సినిమాల గురించి చాలా ఎక్కువగా మాట్లాడుతుంటారు. అలాగే తన దృష్టంతా కేవలం తెలుగు సినిమా పైనే అని, తెలుగు సినిమాని జాతీయ స్థాయికి తీసుకెళ్లాలి, అప్పుడే ప్రాంతీయ సినిమాకి మంచి గుర్తింపు లభించినట్టు అని చెప్తూ ఉంటారు.
#5 అంతేకాకుండా మహేష్ బాబు ఎటువంటి కాంట్రవర్సీల జోలికి వెళ్ళరు. మహేష్ బాబు స్వచ్ఛంద సేవా కార్యక్రమాల్లో కూడా పాల్గొంటూ ఉంటారు. ఎంతో మంది పిల్లలకి గుండె ఆపరేషన్లు చేయించారు. ఎంతోమందికి ఆర్థికంగా సహాయం చేశారు. అలాగే రెండు ఊర్లని దత్తత తీసుకొని వాటిని అభివృద్ధి కూడా చేస్తున్నారు.
#6 ఇవన్నీ మాత్రమే కాకుండా మహేష్ బాబు తన తోటి నటులతో కూడా చాలా స్నేహపూర్వక వాతావరణం ఉండేలాగా చూసుకుంటారు. ఏ హీరో సినిమా అయినా విడుదల అయితే వారికి విషెస్ చెబుతూ లేదా విడుదల అయిన తర్వాత సినిమా బాగుంది అంటూ ప్రశంసిస్తూ ఆ సినిమా గురించి పోస్ట్ చేస్తారు.
అలాగే తన సినిమా ఈవెంట్లకు కూడా ఇతర హీరోలని అతిథిగా పిలుస్తూ ఉంటారు. భరత్ అనే నేను సినిమా సమయంలో జూనియర్ ఎన్టీఆర్ ఆ సినిమా ఈవెంట్ కి అతిధిగా రావడం అప్పట్లో ఒక సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఇది ఒకటే కాకుండా ఇతర హీరోల పుట్టినరోజులకి కూడా విషెస్ చెప్తూ ఉంటారు.
మహేష్ బాబు సహజంగా తొందరగా బరువు పెరుగుతారు. చిన్నప్పుడు కొంచెం బొద్దుగానే ఉండేవారు. వన్ నేనొక్కడినే సినిమా టైంలో ప్రముఖ ఫిట్‌నెస్ ట్రైనర్ క్రిస్ గెతిన్ నుండి మహేష్ బాబు ట్రైనింగ్ తీసుకోవడం మొదలుపెట్టారు. ఆయన ఎంతోమంది బాలీవుడ్ సెలబ్రిటీలకు కూడా ట్రైన్ చేస్తారు. నెలకి దాదాపు 50 లక్షలు ఫీజు తీసుకుంటారు. డ్రామాటిక్ ట్రాన్స్ఫర్మేషన్ ప్రిన్సిపల్ అనే ఒక డైట్ ఫార్ములా 2014లో మహేష్ బాబు మొదలుపెట్టి ఇప్పటివరకు కూడా అదే పాటిస్తున్నారు.
ఇవన్నీ మాత్రమే కాకుండా ఆహార విషయంలో కూడా ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటారు. ఆగకుండా మహేష్ బాబు అరగంటసేపు పరిగెత్తగలుగుతారు. మనసు, మెదడు కూడా ప్రశాంతంగా ఉండేలా చూసుకుంటారు. అంత ప్రశాంతంగా, అందరినీ నవ్విస్తూ, తాను కూడా నవ్వుతూ సరదాగా ఉంటారు కాబట్టే అంత అందంగా కనిపిస్తూ ఉంటారు.
End of Article