Ads
ప్రస్తుతం ఉన్న జీవనశైలి కారణంగా మన సొసైటీలో ఆడవారికి కూడా మగవారితో సమానంగా తమ ప్రతిభను నిరూపిస్తున్నారు. ఉద్యోగాలు ,సంసారం, ఒత్తిడి ఇలా పలు రకాల కారణాల వల్ల ఈరోజు దేశ విదేశాలలో డ్రైవర్స్ తీసుకుని జంటలు ఎక్కువగా ఉంటున్నాయి.
Video Advertisement
అయితే స్త్రీల యొక్క ఒత్తిడి శాతం తో పోల్చుకుంటే పురుషుల ఒత్తిడి శాతం తక్కువనే చెప్పవచ్చు. ఇటు ఇల్లు, అటు ఉద్యోగం రెండిటిని సమర్థవంతంగా నిర్వహించడమే కాకుండా ఇంటి బాధ్యతలు ,పిల్లలు ,చదువు ,ఆరోగ్యం ఇలా మహిళల జీవితం ఒత్తిడితో నిండిపోతుంది.
ప్రస్తుతం డైవర్స్ కోసం ఆపిల్ చేస్తున్న వారిలో పురుషుల కంటే ఆడవారి సంఖ్య ఎక్కువగా ఉంది. వినడానికి ఆశ్చర్యంగా ఉన్న ఇది నిజం…మరి దీనికి కారణాలు ఏమిటో తెలుసుకుందామా..
1. స్వేచ్ఛ లేకపోవడం
పెళ్లి అయిన తర్వాత మహిళలు చాలా వరకు తమ స్వేచ్ఛ తగ్గించబడింది అని భావిస్తారు. ప్రతి చిన్న విషయానికి పోలికలు పెట్టడం, ఆంక్షలు విధించడం పెళ్లి అయిన తర్వాత ప్రతి మహిళ ఎదుర్కొనే సవాళ్లు. ఇవి తారాస్థాయికి చేరినప్పుడు ఇండిపెండెంట్ నేచర్ ఉన్న మహిళలు చాలావరకు ఎటువంటి బంధంలో ఉండడం కంటే విడిపోవడం మేలు అని భావిస్తున్నారు.
2. ఆర్థిక స్వాతంత్రం
పురుషులతో సమానంగా పనిచేస్తున్నప్పటికీ తాము సంపాదించిన ప్రతి రూపాయికి ఇంటిలో లెక్క చెప్పడం మగువల సెల్ఫ్ రెస్పెక్ట్ కు ఇబ్బంది కలిగించే విషయం. పోనీ ఉద్యోగం చేయకుండా ఇంట్లో ఉంటే నువ్వేం చేస్తున్నావ్ ? అని ప్రశ్నిస్తున్నారే తప్ప వారు లేకపోతే ఇల్లు గడవడం ఎంత కష్టమన్న విషయాన్ని ఆలోచించడం మర్చిపోతున్నారు.
3. ఎమోషనల్ స్ట్రెస్
పురుషులు తమ ఎమోషన్స్ ను దాచుకోకుండా ధైర్యంగా అందరి ముందు వ్యక్తీకరించగలరు. కానీ ఇల్లు అయినా ,ఆఫీస్ అయినా ఆడవారికి ఆ స్వాతంత్రం నేటికీ రాలేదు. పేరుకుపోతున్న ఎమోషనల్ స్ట్రెస్ కారణంగా చాలామంది మహిళలు డిప్రెషన్ కి గురి అయ్యి ఇబ్బంది పడుతున్నారు.
4. నిర్లక్ష్యం
చాలామంది పెళ్లి అయిన కొత్తల్లో భార్యతో ఎంతో సరదాగా ఉంటారు. కానీ కాలం కరిచే కొద్ది వారు చూపించే ప్రేమలో మరియు శ్రద్ధలో ఎంతో వ్యత్యాసం కనిపిస్తుంది. బాధ్యతులు పెరుగుతున్నాయి అనవచ్చు కానీ దానికి బంధానికి సంబంధం ఉండదు కదా. తమ పార్ట్నర్ ఎక్కువ నిర్లక్ష్య ధోరణి ప్రదర్శించినప్పుడు మగువలు ఆ బంధంలో ఉండడానికి ఇష్టపడడం లేదు.
5. గృహహింస
మాట్లాడాలంటే ఇది చాలా సెన్సిటివ్ టాపిక్. రక్తం వచ్చేలా కొడితేనే అది గృహహింస కాదు. అనవసరమైన విషయాలకు భార్య మీద చేయి చేసుకోవడం, మానసికంగా హింసించడం కూడా గృహహింస కిందే వస్తాయి. అర్థం చేసుకోలేని భర్త భారంగా భావించి చాలామంది డైవర్స్ తీసుకోవడమే ఉత్తమం అని భావిస్తున్నారు.
ALSO READ : “హిమాచల్ ప్రదేశ్” వరదల్లో సంభవించిన ఆస్తి నష్టం ఎంతో తెలుసా..?
End of Article