Ads
పెళ్లి అనేది ప్రతి ఒక్కరి జీవితంలో మధురమైన ఘట్టం. జీవితంలో మంచి ఉద్యోగంలో సెటిల్ అయిన తర్వాత కొత్త బంధంలోకి అడుగు పెట్టాలని అందరూ అనుకుంటూ ఉంటారు. మన పెద్దలు కూడా 30 దాటుకుండా మూడు ముళ్ళు వేసేయాలని చెబుతూ ఉంటారు. ఆడపిల్లలకైతే 18 దాటితే చాలు పెళ్లి ప్రస్తావన వచ్చేస్తుంది. అయితే ప్రస్తుతం చాలామంది మగవాళ్ళు 30 ఏళ్లు దాటినా కూడా పెళ్లి చేసుకోవడానికి ఆసక్తి చూపడం లేదట. అసలు మీరు పెళ్లి చేసుకోవడానికి ఎందుకు ఆసక్తి చూపడం లేదు అనే దానిపైన కారణాలు చూస్తే ఈ విధంగా ఉన్నాయి…
Video Advertisement
1. ఎక్కువ శాతం మగవాళ్ళు ఒంటరిగా ఉండడానికి ఇష్టపడతారట. మీరు పెళ్లి చేసుకున్న కూడా తమ భాగస్వామిని బాగా చూసుకుంటారు అని గ్యారెంటీ లేదు అందుచేత తమ వల్ల వేరే వాళ్ళు ఇబ్బంది పడకూడదని పెళ్లికి దూరంగా ఉంటారు.
2. పెళ్లయిన జంటల వ్యవహారం చూసి చాలామంది అది నచ్చక పెళ్లి చేసుకోవడం మానేస్తారట. ప్రస్తుతం సమాజంలో పెళ్లైన రెండు నెలలకే విడాకులు తీసేసుకుంటున్నారు. అలాంటప్పుడు పెళ్లి ఎందుకు అనేది వీరి ప్రశ్న.
3. కొన్ని వ్యక్తిగత సిద్ధాంతాలు వ్యవహారానికి దూరంగా ఉంటారు. వీరికి ప్రేమ, పెళ్లి అంటే గిట్టదు.
4. ఎవరి మీద ఆధారపడకుండా సొంతంగా జీవించేవారు పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడరు. ఎందుకంటే ఏదైనా అవసరం వచ్చినప్పుడు అవతలి వాళ్ళని అడగడానికి వీళ్ళకి ఇగో ఫీలింగ్ అడ్డు వస్తుంది.
5. మగవాళ్ళలో చాలామంది మానవ సంబంధాలను నమ్మరట. రేపు పెళ్లి చేసుకున్న వ్యక్తి సరిగ్గా చూసుకుంటుందో లేదో అనే భావన వీరిలో ఉంటుంది.
6. కొందరైతే వివాహం తర్వాత వచ్చే ఇబ్బందులను ముందుగానే ఊహించేసుకుని పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడరు.
7. తాము అందంగా లేము అని ఫీలింగ్ ఉన్నవారు కూడా పెళ్లి చేసుకోరు. చేసుకుని ఇబ్బంది పడడం కంటే ముందే ఆగిపోవడం బెటర్ అనేది వీరి ఫీలింగ్.
End of Article