MRI స్కానింగ్ చేసేటప్పుడు మెటల్స్ ని ఇందుకే అనుమతించరా…? ఏం జరుగుతుందంటే.?

MRI స్కానింగ్ చేసేటప్పుడు మెటల్స్ ని ఇందుకే అనుమతించరా…? ఏం జరుగుతుందంటే.?

by Mounika Singaluri

Ads

MRI స్కానింగ్ అంటే మ్యాగ్నెటిక్ రీసోనేన్స్ ఇమేజింగ్. రేడియాలజీ టెక్నిక్ వాడి మానవ శరీర స్కానింగ్ నిర్వహిస్తూ ఉంటారు. దీనిలో స్కానింగ్ ఇమేజెస్ ను రూపొందించడానికి స్ట్రాంగ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్, మాగ్నెటిక్ పార్టికల్స్ వాడుతూ ఉంటారు.

Video Advertisement

ముఖ్యంగా MRI స్కానింగ్ అనేది మానవ శరీరంలోని ఇంటర్నల్ ఆర్గాన్స్ పని తీరు తెలుసుకునేందుకు ఉపయోగపడుతుంది.ప్రతి చిన్న చిన్న డీటెయిల్స్ MRI స్కానింగ్ లోని హై రిజల్యూషన్ ఇమేజెస్ ద్వారా తెలుసుకుంటారు.

mri scanning 2

MRI స్కానింగ్ ను ముఖ్యంగా బ్రెయిన్ ట్యుమర్స్ , బ్రెయిన్ ఇంజురీలకు సంబంధించిన వాటికి వైద్యులు రిఫర్ చేస్తూ ఉంటారు. ఈ స్కానింగ్ పద్ధతి చాలా సేఫ్ గా ఉంటుంది. అయితే మనలో చాలామంది MRI స్కానింగ్ తీసే పద్ధతిని చూసే ఉంటారు.అయితే ఇప్పుడు ఇంటర్నెట్ లో MRI స్కానింగ్ సంబంధించిన వీడియో ఒకటి వైరల్ అవుతుంది. MRI స్కానింగ్ చేసేటప్పుడు మనిషి తన ఒంటిపైన మెటల్ వస్తువులు ధరించవచ్చా లేదా అనేది వీడియో ఎగ్జాంపుల్ లో చూపించారు. సాధారణంగా MRI స్కానింగ్ చేసేటప్పుడు ఆ టెక్నీషియన్ మనిషి ఒంటి పైన ఉన్న మెటల్ వస్తువులన్నీ తీయించి వేస్తారు.

mri scanning 3

అది ఎందుకు అనేది చాలామందికి తెలియదు. మామూలుగా MRI స్కానింగ్ లో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది వాడతారు. దీనివల్ల స్కానింగ్ జరిగేటప్పుడు ఒంటిమీద మెటల్ వస్తువులు ఉంటే అది మిషన్ ని ఆకర్షిస్తుంది. దాని కారణంగ మెటల్ వస్తువులు అత్తుకుపోయే ప్రమాదం ఉంది. అందుచేత ఎటువంటి ప్రమాదం జరగకుండా ముందస్తుగానే ఒంటి మీద ఉండే ప్రతి మెటల్ వస్తువులు పక్కకు పెట్టి గాని స్కానింగ్ చేయరు. దీని వెనుక ఉన్న అసలైన కారణం ఇది.

Watch Video:

https://www.instagram.com/reel/CzRbupNItKI/?igshid=NjZiM2M3MzIxNA==

Also Read:ప్యాంట్ వెనుక జేబులో పర్స్ పెట్టుకుంటున్నారా..? ఇలా చేయడం వల్ల వచ్చే ఆరోగ్య సమస్యలు ఏంటో తెలుసా..?


End of Article

You may also like