Ads
కొంత మంది ఎంతో కష్టపడి జీవితాన్ని సాగిస్తూ ఉంటారు. వారి కష్టాన్ని ఎవరు గుర్తించినా, గుర్తించకపోయినా కూడా అంతే కష్టపడుతూ పైకి ఎదుగుతూ ఉంటారు. కానీ ఇప్పుడు సోషల్ మీడియా వచ్చిన తర్వాత అలాంటి కష్టపడే వాళ్ళకి ఒక వెలుగు వచ్చినట్టు అయ్యింది.
Video Advertisement
కష్టపడే వాళ్ళందరూ కనిపించాలి అనే అవసరం లేదు. మనకి తెలియకుండా మన చుట్టూ స్ఫూర్తినిచ్చే కథలు ఎన్నో ఉంటాయి. వారందరి జీవితాలని సోషల్ మీడియా ద్వారా బయటికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. అలా ఇటీవల ఒక వ్యక్తి సోషల్ మీడియా ద్వారా ఫేమస్ అయ్యారు. ఆవిడే సాయి కుమారి.
ఐటీసీ కోహినూర్ దగ్గర ఫుడ్ స్టాల్ పెట్టి, ఎంతో మంది కడుపు నింపుతున్నారు. తాను ఒక్కరోజు ఎంత కష్టపడతారో చాలా సార్లు వివరించారు. గుడివాడకి చెందిన సాయికుమారి హైదరాబాద్ కి వచ్చిన తర్వాత మిషన్ కుట్టారు. అంతే కాకుండా సింగర్ హేమచంద్ర తల్లిదండ్రుల ఇంట్లో వంట చేసేవారు. వాళ్ల ప్రోత్సాహంతోనే ఈ ఫుడ్ స్టాల్ మొదలు పెట్టాను అని చెప్పారు. వారిని దేవుళ్లతో సమానంగా చూస్తాను అని అన్నారు.
సాయి కుమారి దగ్గర ప్లేట్ వెజ్ కి 60 రూపాయలు కాగా, నాన్ వెజ్ ప్లేట్ 80 రూపాయలకు అందిస్తున్నారు. బాగార వంటి రైస్ ఐటెమ్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. నాన్ వెజ్ లో గ్రేవీ చికెన్, ఫ్రైడ్ చికెన్, లివర్ ఫ్రై, బోటి కర్రీ, అండా కర్రీ, చేపల కర్రీ వంటి ప్లేట్ కు ఒక ఐటెం చొప్పున అందిస్తున్నారు. సోషల్ మీడియాలో ఇలాంటి మనుషుల కథలు ఎంత బాగా చూపిస్తారో, కొన్నిసార్లు అలాగే ట్రోల్ చేస్తారు కూడా.
సాయి కుమారి 2 లివర్లకి వెయ్యి రూపాయలు అని చెప్తున్న ఒక వీడియో బయటకి వచ్చింది. “అంత ధర పెట్టి ఎందుకు అమ్ముతున్నారు?” అంటూ కొంత మంది కామెంట్స్ కూడా చేశారు. మరి కొంతమంది అయితే ఆవిడ మాట్లాడే మాటలని రీల్స్ చేసి ట్రోల్ చేశారు. అయితే ఇందులో ఎంతవరకు నిజం ఉంది అనేది మాత్రం ఎవరు ఆలోచించలేదు. కానీ ఇటీవల ఇదే సోషల్ మీడియా వల్ల అసలు ఆ వార్తలు ఎంత నిజం ఉంది అనేది బయటికి వచ్చింది.
సాయి కుమారి ఈ విషయం మీద మాట్లాడుతూ, “ఆరోజు తినడానికి ఆరుగురు వచ్చారు. మొత్తం కలిపి 840 రూపాయలు అయ్యింది. తర్వాత ఆరుగురు ఆరుగురు ఎక్స్ట్రా తీసుకున్నారు. మొత్తం 900 అయ్యింది. తర్వాత వంద రూపాయలు లివర్లు రెండు ఎక్స్ట్రా వేయమన్నారు. మొత్తం చూసుకోగా వెయ్యి రూపాయలు అయ్యింది. తిన్న తర్వాత ఇస్తాము అని అన్నారు. అందుకే అడిగాను” అని చెప్పారు. సోషల్ మీడియాలో ఇలా ట్రోల్ చేస్తున్నారు కదా అని అడగగా, “చేయనివ్వండి. వాళ్లకి నిజం తెలియదు కదా? అయినా నవ్వుకున్నారు కదా? వాళ్లు హ్యాపీగా ఉన్నారు కదా? పర్వాలేదులే” అని నవ్వేశారు.
తనని ట్రోల్ చేసినా కూడా చాలా సరదాగా తీసుకున్నారు. నిజానిజాలు ఏంటో తెలుసుకోకుండా ఆవిడ అన్న ఒక్క మాటని మాత్రమే పట్టుకుని విపరీతంగా ట్రోల్ చేశారు. కానీ అసలు నిజం ఇది. ఈ వీడియో షేర్ చేశాక చాలా మంది ఇది చూసి ఆవిడకి మద్దతుగా మాట్లాడుతున్నారు. కానీ వీడియో రాకముందు మాత్రం ఆమెకి మద్దతు ఇచ్చిన వారు తక్కువ మంది ఉన్నారు. అందరూ ఆమె మాటని పట్టుకొని ట్రోల్ చేసిన వాళ్లే. మొత్తం తెలుసుకోకుండా ఎవరిని ఇలా ట్రోల్ చేయొద్దు అని అనుకోవడానికి ఇది ఒక ఉదాహరణ.
watch video :
https://www.instagram.com/reel/C2elqzopINo/?igsh=MWpkYmM3a3poYnB3OQ%3D%3D
ALSO READ : 30 వచ్చినా కూడా మగవారు పెళ్లిపై ఎందుకు ఆసక్తి చూపించట్లేదు.? 7 కారణాలు ఇవేనా.?
End of Article