ప్రపంచం మొత్తం లాక్ డౌన్…కానీ “జపాన్” లో ఎందుకు లేదు.? వెనకున్న కారణం ఇదే.!

ప్రపంచం మొత్తం లాక్ డౌన్…కానీ “జపాన్” లో ఎందుకు లేదు.? వెనకున్న కారణం ఇదే.!

by Anudeep

Ads

ప్రపంచం మొత్తం కరోనా చేస్తున్న విలయతాండవానికి కకావికలం అవుతోంది. ఎక్కడిక్కడ షట్ డౌన్ అయపోయింది. మన దేశంలో ఇరవైఒక్క రోజుల లాక్ డౌన్,చైనా అయితే ఏకంగా రెండు నెలల పాటు చీకటిలోనే గడిపింది. మిగతా దేశాలు కూడా లాక్ డౌన్ ప్రకటించుకున్నాయి.ఇటలీ పరిస్థితి ఇంకా అదుపులోకి రాలేదు.. కానీ  కేవలం జపాన్ మాత్రం ఎప్పటిలానే తన పనులు తాను చేసుకుంటోంది..అది ఎలా సాధ్యం..అక్కడ వైరస్ వ్యాప్తి లేదా??ఎవరూ వైరస్ బారిన పడలేదా? ఇలా ఎన్నో డౌట్లు.. వాటన్నింటికి సమాధానాలివిగో..ఇవి సమాదానాలే కాదు ఒక పాఠం కూడా.

Video Advertisement

నిజానికి చైనా నుండి జనవరిలోనే జపాన్ కి కరోనా వైరస్ వ్యాప్తి చెందింది. ఈ పాటికి యూరోపియన్ కంట్రీస్లో విజృంబించినట్టుగా ఉండుంటే జపాన్లో  కూడా ఫోర్త్ స్టేజ్ ఉండేది.. కానీ అక్కడ ఈ రోజుకి కూడా అంతా నార్మల్ గా ఉంది.రవాణా స్తంబించలేదు. మాల్స్ మూసేయలేదు.ఎటువంటి లాక్ డౌన్ లేదు.. మెట్రో ట్రెయిన్స్, బుల్లెట్ ట్రెయిన్స్ అన్ని నార్మల్ గానే తిరుగుతున్నయి. ఇంటర్నేషనల్ బార్డర్స్ కూడా క్లోజ్ చేయలేదు..జపాన్ రాజధాని టోక్యో టూరిస్ట్ ప్లేస్,అక్కడ ఇప్పటికి విదేశీయులని అనుమతిస్తునే ఉన్నారు..కేవలం స్కూల్స్ ని మాత్రమేక్లోజ్ చేశారు.  మరియు పబ్లిక్ ఈవెంట్స్ ని నిశేదించారు.

కేవలం లాక్ డౌన్ ద్వారా మాత్రమే వైరస్ వ్యాప్తిని అరికట్టగలం అని చెప్తున్నారు కదా..అలాగే వైరస్ వ్యాప్తి చెందకుండా ఉండాలంటే శుభ్రత కూడా అవసరం,సామాజిక దూరం అవసరం అని ఎన్నో నియమాలు చెప్పుకుంటున్నాం .వీటన్నింటిని జపాన్ వాళ్లు చిన్నప్పటి నుండే పాటిస్తారట.. అంటే కొత్తగా వైరస్ వచ్చింది కాబట్టి అని కాకుండా వాళ్ల రోజువారి జీవితంలో ఇవి భాగం అన్నమాట.

కరోనా వైరస్ గురించిన న్యూస్ రాగానే మాస్కులకి,శానిటైజర్లకి బాగా డిమాండ్ పెరిగిపోయింది. జపనీస్ ఇంటి నుండి బయటికి రావడమే మాస్క్ తో వస్తారట.ఏదైనా ప్రయాణం చేసేది ఉన్నా మాస్క్ కంపల్సరి. 60% మంది రెగ్యులర్ గా మాస్క్లని వినియోగిస్తుంటారు. ఈ అలవాటు వైరస్ స్ప్రెడ్ అవకుండా చూడడంలో ఉపయోగపడుతోంది. అంతేకాదు ప్రజలతోనేరుగా కలిసే పర్సన్స్ అంటే రిసెప్షనిస్ట్, గవర్నమెంట్ ఆఫీసర్స్, డాక్టర్స్, నర్సెస్, స్టేషన్ మాష్టార్స్, పోలీస్ ఇలాంటి వాళ్లందరూ వాళ్ల వాళ్ల పనుల దగ్గర ఖచ్చితంగా మాస్క్ ధరించితీరాల్సిందే.

చలికాలం వచ్చిందంటే పిల్లలకు మాస్క్ కంపల్సరీ జపాన్లో ..ఎందుకంటే జలుబు అనేది అంటువ్యాధి అనేది మనకు తెలిసిందే కదా. అలాంటి అంటువ్యాధులు సోకకుండా ముందు జాగ్రత్త చర్య. మన దగ్గర ఎలా పడితే అలా ఉమ్ముఊసేస్తుంటా,కాని అక్కడ ఖచ్చితంగా డస్ట్ బిన్ యూజ్ చేయాల్సిందే..శుభ్రత అనేది వారి సంప్రదాయంలో ఒక భాగం.  శుబ్రత పాటించడం, పెద్దలతో ఎలా మసలుకోవాలి అనే వాటిని అక్కడ అక్షరాలు నేర్చుకోవడానికంటే ముందు స్కూల్స్ లో నేర్పే పాఠాలు. షేక్ హ్యాండ్ అనేది జపాన్లో ఇవ్వనే ఇవ్వరు, దాని బదులు బౌ(bow) ద్వారా గ్రీట్ చేస్తారు.

అంతేకాదు చేతులు కడుక్కోవడం అనేది కూడా సంప్రదాయంలో భాగమే. సోప్స్, శానిటైజర్స్ అనేవి పబ్లిక్ టాయిలెట్స్, ఆఫీస్ ఎంట్రన్స్ లలో, పబ్లిక్ ప్లేసెస్లో కంపల్సరిగా ఉంటాయి. శానిటైజర్ వాడడం అనేది అక్కడ సర్వసాధారణ విషయం.. ఇది వైరస్ వ్యాప్తి నిరోధించడంలో ముఖ్యపాత్ర పోషిస్తుంది. ఎక్కడైనా బయట ట్యాప్ ని వాడాల్సొచ్చినప్పడు వాడిన తర్వాత ట్యాప్ ని, సింక్ ని క్లీన్ చేయడం వారి అలవాటు, నెక్స్ట్ పర్సన్ ఇబ్బంది పడకుండా..మన దగ్గర ఇలాంటి పనులకి బోలెడు నామోషి ఫీలవుతుంటాం.

టిష్యూ పేపర్స్ అనేవి వారి హ్యాండ్ బ్యాగ్స్ లో ఉండే అతి ముఖ్యమైన వస్తువుల్లో ఒకటి. అవి లేకుండా బయటికి రారు. అదేవిధంగా సోషల్ డిస్టెన్సింగ్ అనేది వాళ్లు రెగ్యులర్ గా పాటించేది.దీని గురించి సినిమా నటుడు సుబ్బరాజు బా చెప్తారు.జపాన్ పర్యటనకి వెళ్లినప్పుడు బాహుబలిలో కుమారస్వామి క్యారెక్టర్ కి అక్కడి వాళ్లు ఫిధా అయపోయి, ఆటోగ్రాఫ్ కోసం వెయిట్ చేశారట.అది కూడా ఒక క్యూ పద్దతిలో వచ్చి మరీ ఆటోగ్రాప్ తీసుకున్నారట..అదే మన దగ్గర సినిమా యాక్టర్ కనపడితే సీన్ ఎలా ఉంటుందో ఊహించుకోండి. ఇవండీ జపాన్ వాళ్ల ఆరోగ్య రహస్యం..ఇవన్ని కూడా అక్కడ చదువుకునే ఒక స్టూడెంట్ చేసిన వాట్సప్ మెసేజ్ ఆధారంగా తెలిసిన విషయాలు.


End of Article

You may also like