హిందూ సాంప్రదాయం ప్రకారం కొన్ని ప్రత్యేకమైన రోజుల్లో మాంసాహారాన్ని ఎందుకు నిషేధించారో తెలుసా?

హిందూ సాంప్రదాయం ప్రకారం కొన్ని ప్రత్యేకమైన రోజుల్లో మాంసాహారాన్ని ఎందుకు నిషేధించారో తెలుసా?

by Mounika Singaluri

Ads

ప్రస్తుతం జనరేషన్ వాళ్ళు మారిన కాలానికి అనుగుణంగా తమ సంస్కృతిలో ఎన్నో మార్పులు తీసుకువచ్చారు. అందులో ముఖ్యంగా ఆహారపు అలవాట్లలో చాలా మార్పులు వచ్చాయని చెప్పుకోవచ్చు. కానీ కాలం ఎంత మారినా ఇప్పటికీ ఎన్నో హైందవ కుటుంబాలలో కొన్ని ఆచారాలు ఇంకా మనుగడలో ఉన్నాయి. పవిత్రమైనటువంటి ప్రత్యేకమైన రోజులలో మాంసం తినకపోవడం అనేది ఇప్పటికీ హిందువుల్లో ఎందరో పాటించే ఒక ముఖ్యమైన ఆచారం.

Video Advertisement

మామూలుగా చాలా మంది వారంలో కొన్ని రోజుల్లో అలాగే ఏకాదశి, సంక్రాంతి ,దసరా, సంకట చతుర్థి ,అక్షయ తృతీయ ,దీపావళి ఇలాంటి పర్వదినాలలో మాంసాహారాన్ని ముట్టరు. ఇది మూఢనమ్మకము అని కొందరు కొట్టి పారేసిన దీనికి సాంకేతికంగా కూడా ఎన్నో కారణాలు ఉన్నాయి. మరి అవేమిటో తెలుసుకుందాం…

ఇవి కూడా చదవండి“ఇది కదరా మనకి కావాల్సింది..!” అంటూ… పవన్ కళ్యాణ్ “తమ్ముడు” సినిమా స్పెషల్ షో పై 10 మీమ్స్..!

భారత భూమి తోపో భూమి, ఇప్పటికీ చాలామంది మన సంస్కృతికి సంప్రదాయాలకు విలువనిస్తారు. మన పూర్వీకుల నుంచి మనకు సంక్రమించిన ఎన్నో ఆచారాలలో వారంలో కొన్ని రోజులు మాంసాహారం ముట్టకపోవడం కూడా ఒకటి. ఇలా కొన్ని రోజులు మాంసాహారాన్ని కట్టడి చేయడం వెనక అసలు కారణం, వారం అంతా మాంసాహారం తినడం వల్ల శరీరానికి కలిగే దుష్ప్రయోజనాలే. పైగా వారం అంతా మాంసాహారమే తింటే ఈ భూమిపై మిగిలిన జీవరాశులకు మనుగడ లేకుండా పోతుంది. కాబట్టి కొన్ని ప్రత్యేకమైన రోజులలో జంతు హింస పాపము అని చెప్తారు.

మన శరీరానికి అన్ని రకాల పోషక విలువలు అవసరం. అవి కేవలం మాంసాహారం లోనే దొరక కాబట్టి మనిషి అన్ని రకాల కూరలు, పండ్లు తమ రోజువారి ఆహారపు తలవాట్లలో ఉండేలా చూసుకోవాలి. కానీ ఈ తరం మనుషులు రోజు బయట బిర్యాని తింటున్నామని చెప్పడం గొప్పగా భావిస్తున్నారే తప్ప అది వారి ఆరోగ్యం పై ఎంత ప్రభావం చూపిస్తుంది అనేది మర్చిపోతున్నారు.రోజు మాంసం తినడం వల్ల ఆరోగ్యానికి చాలా ప్రమాదం ఏర్పడుతుంది. పెద్ద పేగు క్యాన్సర్, పైల్స్ ,రక్తపోటు గుండెపోటు, అల్సర్ ఇలా ఎన్నో సమస్యలతో మనిషి సతమతమ అయ్యే అవకాశం ఉంది.

మామూలుగా చెప్తే వినరు కాబట్టి మతం అని ,శాస్త్రం అని పెద్దలు మనకు మంచి సూక్తులు చెప్పారు. వాటిని ఆచరించడం వల్ల ఎటువంటి తప్పులేదు. కానీ కొందరు చాందస్సులు మూర్ఖంగా వితండవాదం చేయడానికి వీటన్నిటిని అంద విశ్వాసాల కింద లెక్క కడతారు. ఏది మంచి ఏది చెడు అని ఆలోచించి ఆచరించాలి తప్ప మూర్ఖంగా మాట్లాడడం సరికాదు.
ఇవి కూడా చదవండి:  ఈ రెండు ఫోటోల మధ్య రెండు తేడాలు ఉన్నాయి…అవి ఏంటో కనిపెట్టగలరా.?


End of Article

You may also like