“ఇది కదరా మనకి కావాల్సింది..!” అంటూ… పవన్ కళ్యాణ్ “తమ్ముడు” సినిమా స్పెషల్ షో పై 10 మీమ్స్..!

“ఇది కదరా మనకి కావాల్సింది..!” అంటూ… పవన్ కళ్యాణ్ “తమ్ముడు” సినిమా స్పెషల్ షో పై 10 మీమ్స్..!

by Mohana Priya

Ads

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు కొద్ది రోజుల్లో రాబోతోంది. పవన్ కళ్యాణ్ కి స్టార్ ఇమేజ్ తీసుకు వచ్చిన సినిమాల్లో మొదటి సినిమా తమ్ముడు. ఈ సినిమాకి పీఏ అరుణ్ ప్రసాద్ దర్శకత్వం వహించారు. ఈ సినిమా విడుదల అయ్యి 22 సంవత్సరాలు అయ్యింది. అయినా సరే ఇప్పటికి కూడా సినిమా క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు.

Video Advertisement

సినిమాలో పవన్ కళ్యాణ్ కామెడీ టైమింగ్ కానీ, యాక్షన్ కానీ ప్రేక్షకులని ఆకట్టుకున్నాయి. అందులోనూ ముఖ్యంగా రమణ గోగుల అందించిన పాటలు అయితే అప్పట్లో ఒక సెన్సేషన్ క్రియేట్ చేశాయి. ఇదిలా ఉండగా పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు సందర్భంగా ఈ సినిమా స్పెషల్ షో రిలీజ్ చేయబోతున్నారు. ఈ సినిమాతో పాటు పవన్ కళ్యాణ్-త్రివిక్రమ్ కాంబినేషన్ లో వచ్చిన జల్సా సినిమా స్పెషల్ షో కూడా రిలీజ్ చేస్తున్నారు అని సమాచారం. తమ్ముడు సినిమా స్పెషల్ షో ఆగస్ట్ 31వ తేదీన రిలీజ్ అవుతుంది.

Trending memes on Pawan Kalyan thammudu special show

ప్రస్తుతం పవన్ కళ్యాణ్ క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో వస్తున్న హరిహర వీరమల్లు సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నారు. ఇది మాత్రమే కాకుండా హరీష్ శంకర్ దర్శకత్వంలో వస్తున్న భవదీయుడు భగత్ సింగ్ సినిమా కూడా పవన్ కళ్యాణ్ చేయబోతున్నారు. పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన భీమ్లా నాయక్ సినిమా ఈ సంవత్సరం మొదట్లో విడుదలై హిట్ టాక్ సంపాదించుకున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు సందర్భంగా ఈ రెండు సినిమాల్లో స్పెషల్ షో విడుదల అవ్వడం కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. దాంతో సోషల్ మీడియాలో తమ్ముడు స్పెషల్ షో పై ట్రెండ్ అవుతున్న కొన్ని మీమ్స్ ఇవే.

#1

#2#3#4#5#6#7#8#9#10#11


End of Article

You may also like