Ads
‘కాంతార’.. గత కొన్ని రోజులుగా సినిమా ఇండస్ట్రీ ని షేక్ చేస్తున్న కన్నడ చిత్రం. భాష తో సంబంధం లేకుండా ప్రతి చోటా ప్రేక్షకుల ఆదరణ పొందుతోంది చిత్రం. హీరో గా.. దర్శకుడిగా రిషబ్ శెట్టి చేసిన అద్భుతానికి అన్ని భాషల్లో మంచి స్పందన వస్తోంది. మరుగున పడిపోతున్న కళలకి దృశ్యరూపం ఇచ్చిన రిషబ్ శెట్టి పై ప్రశంసల వర్షం కురుస్తోంది.
Video Advertisement
రెండు ప్రధాన పాత్రల్లో నటిస్తూ రిషబ్ శెట్టి దర్శకత్వం వహించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద చరిత్ర సృష్టిస్తోంది. కన్నడ వెర్షన్ లోనే కాకుండా ఇతర భాషల్లో కూడా అద్భుతమైన బాక్సాఫీస్ కలెక్షన్లను ఈ సినిమా నమోదు చేస్తుంది.
మొదటి రోజు మంచి టాక్ తెచ్చుకున్న తర్వాత క్రమక్రమంగా ఈ చిత్రం అసాధారణమైన స్పందనను పెంచుకుంటూ కలెక్షన్లలో గణనీయమైన అభివృద్ధిని కనబరిచింది. ముఖ్యం గా క్లైమాక్స్ లో అయితే ప్రేక్షకులను మరో లోకం లోకి తీసుకెళ్తోందని సాధారణ ప్రేక్షకుల నుంచి సెలెబ్రెటీల వరకు అందరూ అభినందనలు కురిపిస్తున్నారు. అయితే కాంతారా సినిమాకు ముంది పింగార అనే ఓ సినిమా వచ్చింది.
ఈ సినిమాను కన్నడ, తులు భాషల్లో తీశారు. పింగార సినిమాలో పీడిత కులాల నిరసనకు వ్యతిరేకంగా చేసే పోరాటం గురించి చూపిస్తారు. కానీ ఆ సినిమా హిట్ కాలేదు. దానికి కారణం కమర్షియల్ హంగులు లేక పోవడమే. కానీ కాంతారా లో అయితే ఒక తెగవాళ్లకు చెందిన ఆచారాన్ని చూపించారు. పైగా కమర్షియల్ హంగులను కూడా దీనిలో మిక్స్ చేసారు. అందుకే ఈ కాంతారా సినిమా హిట్ అయ్యింది. అద్భుతమైన బాక్సాఫీస్ కలెక్షన్లను కూడా ఇది నమోదు చేస్తోంది.
End of Article