బాలయ్య అన్ స్టాపబుల్ షో కి డార్లింగ్ ప్రభాస్ రాకపోవడానికి కారణం అదేనా..? ఎంత పని చేసావ్ UV మామా..?

బాలయ్య అన్ స్టాపబుల్ షో కి డార్లింగ్ ప్రభాస్ రాకపోవడానికి కారణం అదేనా..? ఎంత పని చేసావ్ UV మామా..?

by Anudeep

Ads

థియేటర్లు మూత పడడం వలన కరోనా లాక్ డౌన్ కాలంలో ఓటిటీల వాడకం మరింత ఎక్కువగా పెరిగింది. మరోవైపు ఓటిటీలు కూడా రకరాల సిరీస్ లు, ప్రోగ్రాంలు, సినిమాలు, టాక్ షోలతో ప్రేక్షకులని ఎంటర్టైన్ చేయడానికి సిద్ధం అవుతున్నాయి. తెలుగు ఓటిటి ఆహ కూడా భిన్నమైన కంటెంట్ తో దూసుకెళ్తున్న సంగతి తెలిసిందే.

Video Advertisement

నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా అన్ స్టాపబుల్ అనే టాక్ షోను ఆహ తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. ఈ షోలో పలువురు సెలెబ్రిటీలను బాలయ్య బాబు తీసుకొచ్చి, వారిని ఇంటర్వ్యూ చేసి ప్రేక్షకుల్ని ఎంటర్టైన్ చేసారు.

prabhas 1balayya

ఇటీవలే ఈ షో మొదటి సీజన్ ముగిసింది. ఇప్పటివరకు సాగిన అన్ని ఎపిసోడ్ లు చాలా రసవత్తరంగా సాగాయి. మంచు ఫామిలీ, మహేష్ బాబు, ఆర్ ఆర్ ఆర్ టీం, రవితేజ తో సహా పలువురు సెలెబ్రిటీలు ఈ షో కి వచ్చిన సంగతి తెలిసిందే. అభిమానులు కూడా తమ స్టార్ హీరోలు బాలయ్యతో ముచ్చటించడం చూసి తెగ సంబరపడిపోయారు. ఇక ఈ షో రేటింగ్స్ కూడా ఓ రేంజ్ లో ఉన్నాయి. బాలయ్య తన సత్తాని మరో సారి నిరూపించుకున్నారు.

prabhas

ఇది ఇలా ఉంటె.. ఈ షో కి డార్లింగ్ ప్రభాస్ మాత్రం రాలేదు. ఇంటర్నేషనల్ రేంజ్ కి ఎదిగిన ప్రభాస్ షో కి రాకపోవడంపై ప్రభాస్ అభిమానులు కొంచం అప్ సెట్ గానే ఉన్నారు. వాస్తవానికి, ఈ షో కి ప్రభాస్ రావాల్సి ఉంది. కానీ, ప్రభాస్ కోసం షెడ్యూల్ చేసిన టైం లోనే రాధేశ్యామ్ ప్రమోషన్స్ కి కూడా “యూవీ క్రియేషన్స్” వారు షెడ్యూల్ చేయడం వల్ల ప్రభాస్ రాలేకపోయారు.

prabhas 3

ఇది కనుక షెడ్యూల్ అవ్వకపోయి ఉంటె.. ప్రభాస్, కృష్ణం రాజు గారు కలిసి బాలయ్య అన్ స్టాపబుల్ షో కి వచ్చి ఉండేవారట. ఇది తెలిసాక.. ప్రభాస్ ఫాన్స్ యూవీ క్రియేషన్స్ ని ట్రోల్ చేస్తున్నారు. ఎంత పని చేసావ్ యూవీ మామా అంటూ కామెంట్స్ చేస్తున్నారు.


End of Article

You may also like