Ads
తెలుగులో టాప్ కొరియోగ్రాఫర్‌గా పేరుగాంచిన రాకేశ్ మాస్టర్ అనారోగ్యంతో ఆదివారం నాడు తుదిశ్వాస విడిచారు. గత కొద్ది రోజుల నుండి ఎక్కువగా ఇంటర్వ్యూలు ఇస్తున్న రాకేశ్ మాస్టర్ వేరు, ఒకప్పటి రాకేశ్ మాస్టర్ వేరు. ఆయన 1500 చిత్రాలకు కొరియోగ్రఫీ అందించారు. గ్లోబల్ హ్యూమన్ పీస్ యూనివర్సిటీ నుండి డాక్టరేట్ పొందారు.
Video Advertisement
కొరియోగ్రాఫర్‌గా ఎంతో పేరు తెచ్చుకున్న రాకేశ్ మాస్టర్ కొన్ని రోజుల క్రితం అనాథాశ్రమంలో చేరారు. ఆయన అందరు ఉన్నప్పటికీ, అనాథగా చివరి దాకా అనాథాశ్రమంలో జీవించారు. ఆయన మరణ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో రాకేష్ మాస్టర్ వ్యక్తిగత జీవితం చర్చనీయాంశంగా మారింది. ఆయన భార్య, పిల్లల గురించి చర్చించుకుంటున్నారు. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం.. చాలా సంవత్సరాల నుండి సినిమాలకు దూరంగా ఉన్నా, సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే రాకేష్ మాస్టర్ కు 3పెళ్లిళ్లు జరిగినట్టు తెలుస్తోంది. మొదటి భార్య గురించి అంతగా తెలియదు. ఇక రెండవ వైఫ్ కు ఇద్దరు పిల్లలు ఉన్నారు. వారిలో కొడుకు చరణ్ గురించి అందరికి తెలుసు. లాక్ డౌన్ సమయంలో రాకేష్ మాస్టర్ కొడుకు చరణ్ తో యూట్యూబ్ వీడియోలు చేశారు. రాకేష్ మాస్టర్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, పవన్ కళ్యాణ్ అభిమానులతో జరిగిన గొడవ కారణంగా రెండో భార్య తన నుండి విడిపోయిందని అన్నారు. తన వల్ల వారికి హాని ఉందని, అందుకే చనిపోయినా కూడా రావొద్దని చెప్పిందని ఎమోషనల్ అయ్యారు.
రాకేష్ మాస్టర్ రెండు సంవత్సరాల క్రితం లక్ష్మీ అనే స్త్రీని మూడవ వివాహం చేసుకున్నారని తెలుస్తోంది. అయితే లక్ష్మీ తన డబ్బులన్నీ కాజేసి, తన ఫ్యామిలిని మోసం చేసిందని పలు ఇంటర్వ్యూలల్లో రాకేష్ మాస్టర్ ఆరోపించారు. అంతేకాకుండా తనను జైల్లో పెట్టించడానికి కూడా ప్రయత్నించిందని అన్నారు. దాంతో మానసికంగా క్రుంగిపోయిన రాకేష్ మాస్టర్ అబ్దుల్లాపూర్ మెట్ లో ఉన్న ఒక అనాథశరణాలయంలో చేరారు. ఈ విషయన్ని ఆయనే పలు ఇంటర్వ్యూలల్లో వెల్లడించారు.
Also Read: “రాకేష్ మాస్టర్” చనిపోవడానికి కారణం అదేనా..? అలా అవ్వకపోయి ఉంటే..?
End of Article