Ads
భారత వ్యాపార దిగ్గజం రతన్ టాటా సక్సెస్ స్టోరీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన, వ్యాపార రంగం లోకి అడుగుపెట్టాలనుకునే ఎంతోమందికి స్ఫూర్తినిచ్చారు. అయితే ఎప్పుడైనా సరే మనం ఒక విషయం మాత్రం గుర్తు పెట్టుకోవాలి. ఎలాంటి గొప్ప స్థానంలో ఉన్న వ్యక్తికి అయినా సరే ఆ స్థానం అంత సులభంగా రాదు. మధ్యలో కొన్ని ఇబ్బందులు అలాగే అవమానాలు ఎదుర్కోవాల్సి వస్తుంది.
Video Advertisement
అలా ఎంతో కష్టపడి రతన్ టాటా గారు వ్యాపార దిగ్గజంగా ఎదిగారు. ప్రతి సంవత్సరం ప్రపంచంలో అతి సంపన్నుల జాబితా ఒకటి విడుదల అవుతుంది. అందులో మన భారత దేశానికి చెందిన ఎంతో మంది పేర్లు ఉంటాయి. కానీ మీరు ఎప్పుడైనా గమనిస్తే ఆ జాబితాలో రతన్ టాటా గారి పేరు ఉండదు.
దాంతో చాలా మందికి “రతన్ టాటా గారి పేరు ఎందుకు లేదు?” అనే ప్రశ్న వస్తుంది. అత్యంత సంపన్నుల జాబితాలో రతన్ టాటా గారు ఉండకపోవడానికి గల కారణం ఏంటి అంటే. తన కంపెనీకి, ఇంకా కుటుంబానికి సంబంధించిన ఆదాయంలో 60 శాతం చారిటీ కి వెళ్తుంది. పలు కథనాల ప్రకారం రతన్ టాటా గారు కరోనా పై పోరాడడానికి సహాయంగా 500 కోట్ల విరాళాన్ని అందజేశారు.
అంతే కాకుండా పదిహేను వందల కోట్లు ఇవ్వాలి అని రతన్ టాటా గారు నిర్ణయించుకున్నట్టు సమాచారం. తన సంస్థలో పని చేసే ఉద్యోగుల కోసం కూడా పెన్షన్, మెటర్నిటీ సెలవులు, మెడికల్ సదుపాయాలతో పాటు ఇంకా ఎన్నో పథకాలను అమలు చేశారు. తన కంపెనీ చేసిన లాభాలు రతన్ టాటా గారి వ్యక్తిగత ఆదాయంలోకి వెళ్లవు. ఆ మొత్తం స్వచ్ఛంద సంస్థలకు వెళుతుంది.
End of Article