మెగాస్టార్ నటించిన ఆ సినిమాలో పాటనే “నారప్ప” లో ఎందుకు వాడారు.? ?

మెగాస్టార్ నటించిన ఆ సినిమాలో పాటనే “నారప్ప” లో ఎందుకు వాడారు.? ?

by Anudeep

Ads

ప్రస్తుతం ఎక్కడ చూసిన “నారప్ప” గురించే చర్చ జరుగుతోంది. వింటేజ్ మాస్ లుక్ లో వెంకీ మామ అందరికి తెగ నచ్చేసాడు. ఇక మెగాస్టార్ చిరంజీవి కూడా ఈ సినిమా లో అసలు వెంకటేష్ కనిపించలేదు.. నారప్పే కనిపించాడు అంటూ కితాబిచ్చేసిన సంగతి తెలిసిందే. నారప్ప సినిమాలో వెంకటేష్ కు, అమ్ము అభిరామి కి మధ్య ఓ సాంగ్ వస్తుంది.

Video Advertisement

2 sangharshana narappa

“కట్టు జారిపోతా ఉంది.. చీర కట్టు జారిపోతా ఉంది..” అంటూ వచ్చే ఈ సాంగ్ మెగాస్టార్ చిరంజీవి నటించిన “సంఘర్షణ” సినిమాలోది. ఈ సినిమాను సురేష్ ప్రొడక్షన్స్ వారే నిర్మించారు. 1970 ల కాలం లో రామానాయుడు స్థాపించిన “సురేష్ ప్రొడక్షన్స్” వరుస విజయాలతో దూసుకెళ్తూ ఉంది. 1980 ల నాటికి నాగార్జున, సుమన్, వెంకటేష్, బాలకృష్ణ, చిరంజీవి వంటి యంగ్ హీరోల టైం స్టార్ట్ అయింది. ఆ సమయం లో ఎక్కువ గా ఈ హీరోలతో సినిమాలు చేస్తూ వచ్చారు.

3 sangharshana narappa

1983 లో వచ్చిన “ఖైదీ” సినిమా చిరంజీవి మూవీ కెరీర్ లోనే మైలురాయి గా నిలిచింది. ఈ సినిమాలో ఆయన నటన, ఫైట్ సీన్లు, డాన్స్ లు వేరే లెవెల్ లో ఉన్నాయి. ఈ సినిమా తరువాత సురేష్ ప్రొడక్షన్స్ వారు చిరంజీవి తో “సంఘర్షణ” సినిమాను తీశారు. ఈ సినిమా అదే ఏడాది డిసెంబర్ 29 న రిలీజ్ అయ్యి సక్సెస్ అయ్యింది. ఈ సినిమా పాటలు అద్భుతం గా ఉన్నాయి. కె. చక్రవర్తి ఈ సినిమా కి సంగీత దర్శకత్వం వహించారు.

1 sangharshana

ఈ పాటలన్ని ఆకట్టుకున్నా.. చిరంజీవి సాంగ్స్ టాప్ టెన్ లిస్ట్ లో మాత్రం ఈ సినిమా నుంచి ఒక్క పాట కూడా లేదు. అయితే.. ఈ సినిమా సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ నుంచే వచ్చింది కాబట్టి.. ఈ సినిమా నుంచి ఓ పాటని నారప్ప లోని ఓ సన్నివేశం లో పెట్టారు. మరో వైపు ఈ విషయమై మెగాస్టార్ అభిమానులు కూడా హ్యాపీ గా ఉన్నారు.

watch video:


End of Article

You may also like