Ads
వర్షాకాలం వచ్చిందంటే దోమలు దండయాత్ర మొదలు పెట్టేస్తాయి. తేమ వాతావరణం వల్ల అవి ఎక్కువగా వేడిని కోరుకుంటాయి. అయితే దోమలు మనలో కొందరినే ఎక్కువగా కుడుతుంటాయి. ఎందుకన్నది ఎవరికీ తెలియదు. ఫలానా రక్తం ఉన్న వారు, బ్లడ్ షుగర్ ఉన్నవారు, వెల్లుల్లి లేదా అరటి పండ్లను తినే వారిని, మహిళలను ఎక్కువగా కుడతాయన్న అపోహలు ఉన్నాయి.
Video Advertisement
కానీ అవి కేవలం కొంతమందినే ఆకర్షించేందుకు వేరే కారణాలు ఉన్నాయి. శరీర వేడి, వాసనని బట్టి అవి ఎక్కువగా కుడతాయి అని పరిశోధకులు వెల్లడిస్తున్నారు. మన చర్మం నుంచి వెలువడే ఓ తరహా వాసన దోమలను ఆకర్షిస్తుందని ఒక పరిశోధనలో తేలింది.
దోమలకి అయస్కాంతంగా మారిపోవడానికి కారణం వారి చర్మంపై అధిక స్థాయిలో కార్బాక్సిలిక్ ఆమ్లాలు అని తేలింది. ఇవి దోమలని విపరీతంగా ఆకర్షించుకుంటాయి. ఈ ఆమ్లం మన శరీరం నుంచి ఎక్కువగా ఉత్పత్తి అవ్వడం వల్ల మనం దోమలను ఎక్కువగా ఆకర్షించుకుంటాం. చర్మం పై సహజ మాయిశ్చరైజర్ లేయర్ లో కార్బోక్సిలిక్ యాసిడ్స్ భాగం. ఒక్కొక్కరి శరీరం ఒక్కో విధంగా దీన్ని విడుదల చేస్తుంటుంది.
జంతువులతో పోల్చినప్పుడు మానవులు అధిక మొత్తంలో కార్బాక్సిలిక్ యాసిడ్‌ను విడుదల చేస్తారు. అందుకే దోమలు మనుషుల్ని ఎక్కువగా కుడతాయి. ఒక వ్యక్తి ఆహారం లేదా అలవాట్లు మారినప్పటికీ..ఉత్పత్తి చేయబడే కార్బాక్సిలిక్ యాసిడ్ స్థాయిలు మాత్రం మారడం లేదు. అందుకే దోమలు ఇటువంటి వాళ్ళని ఎక్కువగా కుడుతున్నాయి.
శరీర వాసనతో పాటు రంగు, శరీర వేడి, మద్యం వాసనకి కూడా దోమలు ఆకర్షితులుగా మారతాయి. చర్మ ఉష్ణోగ్రత ఎక్కడ ఎక్కువగా ఉంటుందో అక్కడే దోమలు కూడతాయి. అందుకే అధికంగా చేతులు, కాళ్ళపై కుడతాయి. అంతే కాకుండా బ్లడ్ గ్రూప్ ని బట్టి కూడా ఇందులో తేడాలుంటాయి అని పరిశోధనల్లో వెల్లడైంది.
End of Article