పుష్ప ప్రీ-రిలీజ్ ఈవెంట్ కి దర్శకుడు సుకుమార్ ఎందుకు రాలేదు..? ఈవెంట్ కి ముందు ఏమి జరిగిందో చెప్పేసిన బన్నీ..!

పుష్ప ప్రీ-రిలీజ్ ఈవెంట్ కి దర్శకుడు సుకుమార్ ఎందుకు రాలేదు..? ఈవెంట్ కి ముందు ఏమి జరిగిందో చెప్పేసిన బన్నీ..!

by Anudeep

Ads

ప్రస్తుతం ఎక్కడ చూసినా నడుస్తున్న టాపిక్ పుష్ప. ఈ సినిమాలో అల్లు అర్జున్ చాలా డిఫరెంట్ గా కనిపిస్తున్నారు. అంతే కాకుండా ఈ సినిమా అల్లు అర్జున్ మొదటి పాన్ ఇండియన్ సినిమా. సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరో గా పుష్ప సినిమా తెరకెక్కిన సంగతి తెలిసిందే.

Video Advertisement

ఈ సినిమాలో రష్మిక హీరోయిన్ గా నటించారు. దాదాపు 12 సంవత్సరాల తర్వాత మళ్లీ అల్లు అర్జున్, సుకుమార్ కలిసి చేస్తున్న సినిమా పుష్ప.దాంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా డిసెంబర్ 17 వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

pushpa 1

ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదల అయిన పాటలు, ట్రైలర్ అంచనాలు పెంచేసాయి. రీసెంట్ గా పుష్ప ప్రీ-రిలీజ్ ఈవెంట్ కూడా విజయవంతంగా జరిగిన సంగతి తెలిసిందే. ఈ ఈవెంట్ కి దర్శక ధీర రాజమౌళి కూడా హాజరు అయ్యారు. బన్నీ ని ఇండస్ట్రీకి గిఫ్ట్ అంటూ పొగిడేశారు. ఈ సినిమాకి ఆల్ ది బెస్ట్ కూడా చెప్పక్కర్లేదు అని.. సినిమా అదిరిపోతుంది అంటూ ఫ్యాన్స్ ని మరింత ఊరించేసారు.

pushpa 3

అయితే.. ఈ ఈవెంట్ చాలా గ్రాండ్ గా జరిగినప్పటికీ.. ఈవెంట్ కి “పుష్ప” సినిమా దర్శకుడు సుకుమార్ మాత్రం రాలేదు. సుక్కు ఎందుకు రాలేదు..? అంటూ ఫ్యాన్స్ తెగ చర్చలు జరిపేస్తున్నారు. నిజానికి సుకుమార్ ముంబై లో ఉన్నారు. ఈవెంట్ హైదరాబాద్ లో జరుగుతోంది. ముంబై నుంచి హైదరాబాద్ కు రావడం పెద్ద కష్టమేమి కాదు. కానీ సుకుమార్ ఆ పని చేయలేదు. ఎందుకంటే పుష్ప రిలీజ్ డేట్ దగ్గరపడుతోంది.

pushpa 2

మరో వైపు చాలా పనులు పెండింగ్ లో ఉండిపోయాయి. మరో మూడు రోజుల్లో ఓవర్సీస్ లో పుష్ప ప్రీమియర్స్ పడాల్సి ఉంది. మరోవైపు పనులన్నీ ఎక్కడివక్కడే ఉండిపోయాయి. ఈ పరిస్థితిలో ఫంక్షన్ కోసం హైదరాబాద్ రావాలి అంటే… కనీసం ఒకరోజు టైం కేటాయించాలి. ఇంత టైట్ సిట్యుయేషన్ లో ఒక రోజు అంటే అది చాలా ముఖ్యం. సినిమా రిలీజ్ కి సంబంధించి చాలా పనులు పూర్తి చేయాల్సి ఉండడంతో సుకుమార్ డ్రాప్ అయ్యారు.

pushpa 4

ఈ ఫంక్షన్ కి బన్నీ అన్ని పనులు దగ్గరుండి చూసుకుని ఫంక్షన్ ని గ్రాండ్ సక్సెస్ చేసాడు. ఇక ఈ ఈవెంట్ కి ముందు సుకుమార్ డ్రాప్ అయ్యారు అని తెలిసి.. బన్నీ సుక్కుకి ఫోన్ చేశారట. కావాలంటే జెట్ పంపిస్తాను.. ఈవెంట్ కి మాత్రం కచ్చితంగా రావాలి అని అడిగారట. కానీ, పరిస్థితిని వివరించి సుకుమార్ బన్నీ ని కన్విన్స్ చేశారట. ఈ సినిమా సక్సెస్ అవుతుందని.. ఆ సక్సెస్ నీదో..నాదో మాత్రమే కాదని.. మనందరిది అని.. ఈ సినిమా వల్ల మంచి పేరు వస్తే.. అది మనందరిది అని చెప్తూ బన్నీ ని ఎంకరేజ్ చేశారట.


End of Article

You may also like