కార్తికేయ 2 లో “స్వాతి” ని అందుకే తీసుకోలేదా.? ఆ ఒక్క కారణంతోనే “అనుపమ”ను తీసుకున్నారా.?

కార్తికేయ 2 లో “స్వాతి” ని అందుకే తీసుకోలేదా.? ఆ ఒక్క కారణంతోనే “అనుపమ”ను తీసుకున్నారా.?

by Anudeep

Ads

చందు మొండేటి దర్శకత్వంలో సస్పెన్స్ థ్రిల్లర్ గా చిత్రీకరించిన సినిమా కార్తికేయ. ఈ సినిమాలో నిఖిల్ ,కలర్స్ స్వాతి జంటగా నటించారు. 2014లో విడుదలైన ఈ చిత్రం మంచి గుర్తింపు సంపాదించడంతో ఆ సినిమాకి సీక్వెల్ ను కూడా నిర్మించారు. కానీ ఈ చిత్రంలో హీరోయిన్ క్యారెక్టర్ కి కార్తికేయ లో హీరోయిన్ రోల్ చేసిన కలర్స్ స్వాతి బదులు అనుపమ పరమేశ్వరన్ ను ఎంపిక చేశారు.

Video Advertisement

కార్తికేయ లో తన క్యూట్ పర్ఫామెన్స్ తో మంచి గుర్తింపు తెచ్చుకున్న కలర్స్ స్వాతి బదులు అనుపమను కార్తికేయ 2 కి హీరోయిన్ గా తీసుకోవడంపై నేటిజెన్లు పెద్ద ఎతున్న స్పందిస్తున్నారు. ఆగస్టు 13వ తేదీన విడుదలై ప్రేక్షకుల ముందుకు కనువిందు చేయడానికి రానున్న ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలు జోరుగా నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో సినిమా ప్రమోషన్ కార్యక్రమం భాగంగా ఇంటర్వ్యూలో పాల్గొన్న నిఖిల్ ను కార్తికేయ 2 సినిమాలో కలర్స్ స్వాతి బదులు అనుపమ నటించడానికి గల కారణాలను ప్రశ్నించగా ఆయన దానికి వెంటనే స్పందిస్తూ దాని వెనుక గల కారణాలను వివరించారు.


కార్తికేయ కంప్లీట్ పల్లెటూరు నేపథ్యంలో తీశారని దానికి చక్కటి తెలుగమ్మాయిలాగా ఉన్న స్వాతి బాగా సెట్ అయిందని, కానీ ఇప్పుడు తీస్తున్న కార్తికేయ 2 మూవీకి హీరోయిన్ నార్త్ ఇండియన్ లా కనిపించడం ముఖ్యమని కలర్స్ స్వాతి ఆ పాత్రకి సెట్ కారు అన్న ఉద్దేశంతో అనుపమను తీసుకున్నట్లు తెలిపారు. సినిమా పూర్తి అయ్యి ప్రేక్షకుల ముందుకు రావడానికి రెడీ అయి చాలా కాలం అయినప్పటికీ కరోనా వల్ల తర్వాత థియేటర్లు దొరక్క పోవడం వల్ల రిలీజ్ ఆలస్యం అవుతూ వచ్చిందని ఇన్ని రోజులకు ఆగస్టు 13న రిలీజ్ అవుతుందని ఆయన హర్షం వ్యక్తం చేశారు.


End of Article

You may also like