Ads
అఖిల్ అక్కినేని హీరోగా నటిస్తున్న ఏజెంట్ సినిమా టీజర్ ఇటీవల విడుదల అయ్యింది. ఈ సినిమాకి సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా పాన్ ఇండియన్ సినిమాగా విడుదలవుతోంది. గత కొంతకాలం నుండి గమనిస్తే ఈ ట్రెండ్ చాలా మంది హీరోలు ఫాలో అవుతున్నారు.
Video Advertisement
అంతకుముందు శంకర్, మణిరత్నం వంటి దర్శకులు దర్శకత్వం వహించిన సినిమాలు, వారి భాషల్లో మాత్రమే కాకుండా ఇతర భాషల్లో కూడా డబ్ అయ్యి విడుదల అయ్యేవి. ఆ తర్వాత ఇదే ట్రెండ్ కంటిన్యూ చేస్తూ రాజమౌళి బాహుబలి సినిమాని సౌత్ ఇండియన్ భాషల్లో, అలాగే హిందీ భాషలో విడుదల చేశారు.
అలాగే ఇటీవల రాజమౌళి దర్శకత్వం వహించిన బ్లాక్ బస్టర్ అయిన సినిమా ఆర్ఆర్ఆర్ కూడా పాన్ ఇండియన్ సినిమాగా విడుదల అయ్యింది. ఇవి మాత్రమే కాకుండా ఇతర భాషల్లో వచ్చే సినిమాలను కూడా, వారి ఒక్క భాషలో మాత్రమే కాకుండా ఇతర భారతీయ భాషల్లో విడుదల చేస్తున్నారు. ఇది ఒక రకంగా మంచిదే. కానీ కొన్ని సినిమాలకు మాత్రం ఈ ప్రయత్నం చేయడం ఎంతవరకు కరెక్ట్ అనే సందేహం ప్రేక్షకుల్లో నెలకొంది. పెద్దపెద్ద స్టార్ హీరోల సినిమాలు అయితే వేరే భాషల్లో విడుదలైనా సరే కాస్త క్రేజ్ ఉంది కాబట్టి వారికి కలెక్షన్స్ వచ్చే అవకాశం ఉంది.
కానీ కథ కొంతకాలం నుండి గమనిస్తే పెద్ద హీరోల సినిమాలతో పాటు యంగ్ హీరోల సినిమాలు కూడా పాన్ ఇండియన్ సినిమాలుగా విడుదల అవుతున్నాయి. కొన్ని సినిమాల్లో నిజంగా అంత మంచి కథ ఉంటే అలాంటి సినిమాలు పాన్ ఇండియన్ సినిమాలుగా విడుదల అయినా మంచిదే. కొన్ని సినిమాల్లో కథ బలహీనంగా ఉన్నా కూడా ఇలాగే విడుదలవుతున్నాయి. బాహుబలి సినిమాతో ప్రభాస్ కి చాలా క్రేజ్ వచ్చింది. అదే క్రేజ్ ఫాలో అవుతూ బాహుబలి తర్వాత వచ్చిన సాహో అలాగే రాధే శ్యామ్ సినిమాలు కూడా పాన్ ఇండియన్ సినిమాలుగా విడుదల అయ్యాయి. నెక్స్ట్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న సినిమాలు కూడా ఇలాగే విడుదల అవుతాయి.
అయితే ఇప్పుడు విజయ్ దేవరకొండ హీరోగా నటించిన లైగర్, అలాగే నిఖిల్ హీరోగా నటిస్తున్న కార్తికేయతో పాటు సమంత నటిస్తున్న యశోద, అలాగే సందీప్ కిషన్ హీరోగా నటిస్తున్న మైఖేల్, నిఖిల్ హీరోగా నటిస్తున్న మరొక సినిమా స్పై సినిమా కూడా పాన్ ఇండియన్ సినిమాలుగా విడుదల అవుతున్నాయి. కానీ ఒకసారి గమనిస్తే వీళ్ళందరికీ పాన్ ఇండియన్ లెవెల్ క్రేజ్ లేదు. కొన్ని సినిమాలు కేవలం తెలుగులో ప్రేక్షకులు మాత్రమే ఆదరించే సినిమాలు. దాంతో చాలా మంది, “ప్రతి సినిమా ఇలా విడుదల చేయాల్సిన అవసరం లేదు కదా? కొన్ని సినిమాలు తెలుగులో హిట్ అయితే వేరే వాళ్ళకి కూడా తెలుస్తాయి కదా?” అని కామెంట్స్ చేస్తున్నారు.
End of Article