పాల ప్యాకెట్స్ పై “IIM Alumni” ట్యాగ్స్ ఎందుకు..? సోషల్ మీడియాలో రచ్చ రచ్చ.. అసలేం జరుగుతుందంటే..?

పాల ప్యాకెట్స్ పై “IIM Alumni” ట్యాగ్స్ ఎందుకు..? సోషల్ మీడియాలో రచ్చ రచ్చ.. అసలేం జరుగుతుందంటే..?

by Anudeep

Ads

ఉదయం నిద్రలేవగానే ప్రతి ఇంట్లో ముందుగా అవసరం అయ్యేది పాల ప్యాకెట్. అయితే.. ఏ కంపెనీ పాల ప్యాకెట్ అయినా దానిపై కొన్ని వివరాలు కామన్ గా ఉంటాయి. అవేంటంటే.. ఒక పాల ప్యాకెట్ ని ఎప్పుడు తయారు చేసారు.. ఏ తారీకు లోపు అది ఎక్స్పైర్ అయిపోతుంది లాంటి వివరాలు ఉండడం మాములే.

Video Advertisement

అయితే.. ఓ పాల ప్యాకెట్ పై మాత్రం “IIM Alumni” ట్యాగ్ ముద్రించబడి ఉంది. దీనితో ఈ విషయం చర్చనీయాంశం అయింది. స్మార్ట్ ఫోన్ అందుబాటులోకి వచ్చేసాక.. ఏ చిన్న వింత చోటు చేసుకున్నా అది క్షణాల్లో వైరల్ అయిపోతోంది.

అయితే.. ఇప్పుడు ఓ పాల ప్యాకెట్ పై కళాశాల పేరు ముద్రించబడడం చర్చకు తావిస్తోంది. ఓ పాల ప్యాకెట్ పై “ఫౌండెడ్‌ బై IIM Alumni అని ముద్రించి ఉండడంతో షాక్ అవుతున్నారు. ఈ ఫోటో ఓ వ్యక్తి ట్విట్టర్ లో పెట్టి ప్రశ్నించడంతో అది వైరల్ అయ్యింది. ఇప్పుడు ఈ విషయమై ట్విట్టర్ లో చర్చ నడుస్తోంది.

milk packet 1

సాధారణంగా కొన్ని స్టార్ట్ అప్ కంపెనీలు ప్రచారం చేసుకునేటప్పుడు తాము చదువుకున్న కాలేజీ నేమ్స్ ను చెప్పుకుంటూ ఉంటారు. కానీ.. ఇలా ఓ పాల ప్యాకెట్ పై వేయడం మాత్రం నెటిజన్స్ లో చర్చకి తెరలేపుతోంది. ఏ కంపెనీ అయినా నాణ్యత ద్వారా పేరు పొందాలి కానీ.. ఇలా కాలేజీ పేరు చెప్పుకుని కాదు అని కొందరు వాదిస్తున్నారు. మరికొందరేమో.. ఇలా కాలేజీ పేరు వేసుకోనివ్వడం అనేది కాలేజీ తప్పేనని వాదిస్తున్నారు. ఈ విషయమై సోషల్ మీడియాలో వాడివేడిగా చర్చ నడుస్తోంది.


End of Article

You may also like