Ads
మెగా ఫ్యామిలీ నుండి వచ్చినా కూడా, ఇప్పుడు స్టైలిష్ స్టార్ నుండి ఐకాన్ స్టార్ గా ఎదిగారు అల్లు అర్జున్. అల్లు అర్జున్ జర్నీ అంత సులభంగా సాగలేదు. ఎన్నో ఫ్లాప్ సినిమాలు వచ్చాయి. ఎన్నో విమర్శలు ఎదుర్కొన్నారు. కొన్ని సినిమాలు అనుకున్న విధంగా ఆడలేదు. ఆ సమయంలో అల్లు అర్జున్ వచ్చి వివరణ ఇవ్వాల్సిన సమయాలు కూడా అయ్యాయి. సినిమా కోసం తన వంద శాతాన్ని ఇస్తారు. ప్రతి సినిమాలో ఏదో కొత్తగా చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటారు.
Video Advertisement
సాధారణంగా హీరోలు తమ సినిమాల్లో పాటలు ఎలా ఉండాలి అనే విషయం గురించి ఎక్కువగా పట్టించుకోరు. సంగీత దర్శకుడి మీద ఎంత నమ్మకం ఉన్నా కూడా, సినిమాలో పాటలు ఎలా ఉండాలి అనే విషయం మీద అల్లు అర్జున్ కి ఒక అవగాహన ఉంటుంది. ఇది నటుడికి ఉండాల్సిన గొప్ప లక్షణాల్లో ఒకటి. ఆ పాట ఎలా ఉండాలి? ఏ సింగర్ పాడాలి? అనే విషయాలు కూడా అల్లు అర్జున్ ఆలోచిస్తారు. సినిమాలో తన పాత్ర ఎలా ఉండాలి, ఆ పాత్ర వేషధారణ ఎలా ఉండాలి అనే విషయాలు కూడా అల్లు అర్జున్ ఆలోచించి ఎంతో జాగ్రత్త తీసుకుంటారు.
అంత జాగ్రత్త తీసుకుంటారు కాబట్టి అల్లు అర్జున్ ప్రతి సినిమాలో అల్లు అర్జున్ పాత్ర వేసుకున్న కాస్ట్యూమ్స్, పాటలు, డాన్స్ స్టెప్స్, డైలాగ్స్ చాలా పాపులర్ అవుతాయి. అయితే, అల్లు అర్జున్ వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ప్రయాణం కూడా సులభంగా సాగలేదు. అల్లు అర్జున్ మెగాస్టార్ కుటుంబం నుండి వచ్చారు అని అంటారు. కానీ కొంత మంది అల్లు అర్జున్ అల్లు రామలింగయ్య గారి కుటుంబం నుండి వచ్చారు అని అంటారు. ఇటీవల జరిగిన రాజకీయాలు అల్లు అర్జున్ వ్యక్తిగత జీవితం గురించి చర్చనీయాంశంగా మారాయి.
అల్లు అర్జున్ వైఎస్ఆర్సిపి అభ్యర్థి అయిన శిల్ప రవీందర్ రెడ్డికి మద్దతు తెలుపుతూ నంద్యాలకి వెళ్లారు. దాంతో అల్లు అర్జున్ మీద కామెంట్స్ వచ్చాయి. ఇప్పుడు కిరాక్ ఆర్పీ, అల్లు అర్జున్ మీద కామెంట్స్ చేయడం మొదలుపెట్టారు. మెగా ఫ్యామిలీ లేకపోతే అల్లు అర్జున్ లేదు అని అన్నారు. మళ్లీ మాట్లాడుతూ, “అందరు హీరోలకి అభిమానులు ఉంటారు అల్లు అర్జున్ కి ఆర్మీ ఉంటారు అని అల్లు అర్జున్ అంటారు. ఆర్మీ అంటే ఏంటి. అసలు వాళ్ళు ఏం చేస్తారు” అని కిరాక్ ఆర్పీ మాట్లాడారు. అల్లు అర్జున్ గతంలో చెప్పను బ్రదర్ అని అన్నారు. ఈ విషయం మీద కూడా కామెంట్స్ వచ్చాయి.
అప్పుడు అల్లు అర్జున్ ఒక సందర్భంలో పేర్లు పెట్టి పిలవకూడదు అని, పక్కన గారు అని గౌరవంగా పిలవాలి అని చెప్పారు. ఇప్పుడు కిరాక్ ఆర్పీ మాట్లాడిన మాటలకు మాత్రం కామెంట్స్ బాగా వస్తున్నాయి. “అల్లు అర్జున్ మెగా ఫ్యామిలీ నుండి వచ్చినా కూడా, ఇంత దూరం రావడానికి అల్లు అర్జున్ టాలెంట్ మాత్రమే కారణం. ఇటీవల వచ్చిన పుష్ప సినిమా అందుకు ఉదాహరణ. అలాంటి అల్లు అర్జున్ ని ఇలాంటి మాటలు ఎలా అంటారు” అంటూ అల్లు అర్జున్ కి మద్దతు ఇస్తున్నారు. అసలు ప్రతిసారి అల్లు అర్జున్ మీద మాత్రమే ఇలాంటి కామెంట్స్ ఎందుకు వస్తాయి అని అంటున్నారు.
End of Article