Ads
ఒక సినిమా డైరెక్టర్ కి తన సినిమా కథ, నిర్మాణం, నటీనటులు ఇవన్నీ ఎంత ముఖ్యమో, ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్టు సినిమా తీయడం కూడా అంతే ముఖ్యం. ఒక సినిమా విడుదల అయ్యే టైం పట్టి కూడా ఆ సినిమా ఫలితం, సినిమా రూపొందించే విధానం ఉంటాయి.
Video Advertisement
ఇప్పుడు గుంటూరు కారం సినిమా విషయంలో కూడా జరిగింది అదే. సినిమా బృందం మీద మొదటి నుండి కామెంట్స్ వస్తూనే ఉన్నాయి. ముఖ్యంగా కుర్చీ మడత పెట్టి సాంగ్ ప్రోమో రిలీజ్ అయిన తర్వాత వచ్చిన కామెంట్స్ మామూలుగా లేదు.
“మహేష్ బాబు లాంటి హీరో ఇలాంటి సోషల్ మీడియా రెఫరెన్స్ వాడి పాట చేయడం ఏంటి?” “అసలు త్రివిక్రమ్ క్వాలిటీ పడిపోయింది.” “ఆయన అంతకుముందు ఎలా ఉండేవారు? ఇప్పుడు ఎలా ఉన్నారు?” ఇలా ఒకటి కాదు. రెండు కాదు. కొన్ని వేల కామెంట్స్ వచ్చాయి. అంతే కాకుండా త్రివిక్రమ్ పాత వీడియోలని చూపిస్తూ, “అప్పట్లో ఇలాంటి మంచి క్వాలిటీ కంటెంట్ ఇచ్చే రైటర్ ఇప్పుడు ఇలా అయిపోయారు” అంటూ కామెంట్స్ చేశారు. కానీ ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటి అంటే, సినిమా అనేది ఒకవైపు ఎంటర్టైన్మెంట్ మాత్రమే కాదు. మరొక వైపు వ్యాపారం కూడా. సినిమా మీద కొన్ని కోట్ల రూపాయల పెట్టుబడి ఉంటుంది.
అది కూడా ఒక స్టార్ హీరో సినిమా అంటే ఇంకా ఎక్కువ ఉంటుంది. అందుకే దర్శకుడు తన వ్యక్తిగత అభిరుచులని పక్కన పెట్టి, ప్రేక్షకులకి ఎలాంటి సమయంలో ఎలాంటి కంటెంట్ ఉన్న సినిమా ఇస్తే క్లిక్ అవుతుంది అనే విషయాన్ని ఆలోచించి, అందుకు అనుగుణంగా నిర్ణయం తీసుకుంటారు. హీరోలు కూడా అంతే. తమ ఫ్యాన్స్ తమని ఎలా చూడాలి అనుకుంటున్నారు అనే విషయాన్ని దృష్టిలో పెట్టుకొని సినిమాలు చేస్తారు. ఇప్పుడు ఈ సినిమా విషయానికి వస్తే ఇది పక్కా పండుగ సినిమా. పండగ అన్నాక అన్ని వర్గాల ప్రేక్షకులు సినిమాలకు వెళ్తారు.
అన్ని వర్గాల ప్రేక్షకులని ఎంటర్టైన్ చేసే బాధ్యత సినిమా బృందం మీద ఉంది. అలాంటప్పుడు సినిమాలో అందరిని ఆకట్టుకునే కంటెంట్ కూడా ఉండాలి. పండగ అంటే సరదాగా ఉండే సినిమాలు చూడాలి అనుకుంటారు. సీరియస్ గా ఉండే సినిమాలు చూడటం కష్టమే. అంతే కాకుండా సినిమా బృందం ముందు నుండి కూడా మహేష్ బాబుని ఈ సినిమాలో కొత్తగా చూస్తారు అని చెప్తూనే ఉన్నారు. వాళ్ళు చెప్పినట్టే మహేష్ బాబు ఈ సినిమాలో కొత్తగా కనిపించారు. నకిలీసు గొలుసు పాటకి డాన్స్ వేస్తారు అని ఒక వార్త వచ్చినప్పుడు కూడా ఎన్నో కామెంట్స్ వచ్చాయి.
కానీ ఒక్కసారి సినిమా చూశాక అవన్నీ ఆగిపోయాయి. మహేష్ బాబు అలా డాన్స్ వేస్తున్నప్పుడు ప్రేక్షకులు ఎంజాయ్ చేశారు. ఏ పాటకి అయితే ఇదేం పాట అంటూ కామెంట్స్ చేశారో, ఇప్పుడు అదే పాటని ప్రతిచోట పెడుతున్నారు. సినిమా చూసి వచ్చాక అవే పాటలకి మహేష్ బాబు వేసిన డాన్స్ బాగుంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు. సినిమా బృందం కూడా అంతకుముందు ఆ పాటలు థియేటర్ లో చాలా బాగుంటాయి అని చెప్పారు. దీన్ని బట్టి అర్థమైంది ఏంటి అంటే, వాళ్ళు ఎలాంటి తప్పు చేయలేదు. వాళ్లు ముందు నుంచి స్పష్టంగానే వాళ్లు ఎలాంటి సినిమా ప్రెజెంట్ చేస్తున్నారు అనే విషయాన్ని ప్రేక్షకులకు చెప్తూనే ఉన్నారు. వాళ్ల క్లారిటీ ముందు నుండి అలాగే ఉంది. ఇంక ఇప్పుడు వాళ్ళు చెప్పినట్టే జరిగింది. నిజంగానే ఈ పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. అందరూ మెచ్చుకుంటూ కామెంట్స్ చేస్తున్నారు.
End of Article