Ads
ఒక మనిషికి తిండి, నిద్ర ఎంత ముఖ్యమో, పాటలు వినడం కూడా అంటే ముఖ్యం. అసలు సంగీతం లేని ప్రపంచాన్ని తలుచుకోవాలంటేనే భయం వేస్తోంది. ఒక రోజులో ఒక మనిషి ఒక్కసారైనా సరే ఏదో ఒక పాట వింటాడు. అంతెందుకు. కేవలం పాటల వల్ల మాత్రమే హిట్ అయిన సినిమాలు కూడా చాలా ఉన్నాయి.
Video Advertisement
అందుకే సినిమాకి హీరో, దర్శకుడుతో పాటు సంగీత దర్శకుడు కూడా అంతే ముఖ్యం. ఇండస్ట్రీలో ఎంతో మంది సంగీత దర్శకులు ఉన్నారు. కొంత మంది సీనియర్ సంగీత దర్శకులు అయితే, మరి కొంత మంది యంగ్ సంగీత దర్శకులు. అయితే స్టార్ సంగీత దర్శకులు అంటే గుర్తు వచ్చేది మాత్రం ఇద్దరే. ఒకరు దేవి శ్రీ ప్రసాద్, ఇంకొకరు తమన్. ప్రస్తుతం ఎక్కడ చూసినా వీరి పాటలే ఎక్కువగా వినిపిస్తున్నాయి.
కిక్ సినిమాతో తమన్ ఫేమస్ అయితే, దేవి సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు దేవి శ్రీ ప్రసాద్. అయితే వీరిద్దరూ సంగీత దర్శకులుగా పరిచయం అవ్వకముందు, కొంత మంది సీనియర్ సంగీత దర్శకుల దగ్గర అసిస్టెంట్ గా చేశారు. చాలా మంది సంగీత దర్శకులు వస్తున్నారు. కొంత మంది రిటైర్ కూడా అవుతున్నారు. కానీ తమన్, దేవి శ్రీ ప్రసాద్ మాత్రం తరచుగా సినిమాలు చేస్తూనే ఉన్నారు. అసలు ఇన్ని సంవత్సరాలు అయినా వీరికి అవకాశాలు రావడానికి కారణాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.
అవగాహన
వీరి పాటలు కూడా అన్ని హిట్ అవ్వలేదు. వీరు సంగీతం ఇచ్చిన పాటలు కొన్ని ఫ్లాప్ కూడా అయ్యాయి. దేవి శ్రీ ప్రసాద్ ఆ మధ్యలో భాయ్ వంటి సినిమాల్లో అంత గొప్ప పాటలు ఏమీ ఇవ్వలేదు. తమన్ కూడా రభస లాంటి సినిమాలకి అంత మంచి మ్యూజిక్ ఇవ్వలేదు. విరి పాటలు అన్నీ ఒకే రకంగా అయిపోయాయి. దాంతో ఇద్దరు సంగీత దర్శకులు కూడా మధ్యలో బ్రేక్ తీసుకొని ప్రస్తుతం ట్రెండ్ ఎలా ఉందో అర్థం చేసుకొని మళ్లీ కంపోజ్ చేయడం మొదలుపెట్టారు.
ఒక పాట వస్తోంది అంటే, అది సోషల్ మీడియాలో కూడా ట్రెండ్ అవ్వాలి. అలానే ఆ పాటకి గ్లోబల్ గా గుర్తింపు వస్తుంది. సినిమాల్లో చేసే వారికి, ముఖ్యంగా ఇలాంటి పొజిషన్ లో ఉన్నవారికి ఈ అవగాహన ఉండడం అనేది చాలా ముఖ్యమైన విషయం. అలా ప్రస్తుతం ప్రేక్షకుల అభిరుచి ఎలా ఉంది అనే విషయాన్ని ఎప్పటికీ అప్పుడు ఫాలో అవుతూ వారిని వారు ఈ ట్రెండ్ కి తగ్గట్టు మార్చుకొని మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నారు కాబట్టి వీరికి అవకాశాలు ఎక్కువగా వస్తున్నాయి.
క్వాలిటీ
టెక్నాలజీ కూడా చాలా మారింది. పాట క్వాలిటీ అనేది చాలా ప్రాముఖ్యత ఇచ్చే అంశంగా మారిపోయింది. అందుకే సౌండ్ రికార్డింగ్ విషయంలో కూడా వీళ్లు చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. ఎక్కడికో వెళ్లి పాటలు రికార్డ్ చేసి, ఇంకా వేరే చోటికి వెళ్లి ఆ పాటలు మిక్స్, చేసి ఇలా చాలా చేసి ఒక్క పాటని కంపోజ్ చేస్తారు. ఇది కేవలం వీరు మాత్రమే కాదు. ఏఆర్ రెహమాన్ లాంటి సీనియర్ సంగీత దర్శకులు పాట కోసం సంవత్సరం తీసుకున్న సమయం కూడా ఉంది. కానీ యంగ్ మ్యూజిక్ డైరెక్టర్స్ లో మాత్రం మీరు ఇలాంటి విషయాల్లో శ్రద్ధ తీసుకుంటున్నారు.
బ్యాలెన్స్
హీరో ఇమేజ్ ఎప్పటికి అప్పుడు మారిపోతూ ఉంటుంది. ఒక హీరో అప్పుడప్పుడే వచ్చిన హీరోగా ఉన్నప్పుడు ఒక రకమైన పాటలు అతనికి సూట్ అవుతాయి. ఆ తర్వాత మిడ్ రేంజ్ హీరో అయినప్పుడు ఇంకొక రకమైన పాటలు అతని సినిమాలకి సూట్ అవుతాయి. ఇంక స్టార్ అయ్యాక ఆ హీరో ఆ సినిమాలో చేసే ప్రతి విషయం మీద శ్రద్ధ ఉంటుంది కాబట్టి ఒక స్టార్ హీరో సినిమాకి అదే రేంజ్ లో పాటలు కంపోజ్ చేయాలి.
అప్ కమింగ్ హీరోగా ఉన్నప్పుడు అతనికి ఇచ్చిన పాటలు, స్టార్ అయ్యాక సినిమాల్లో వాడడం కుదరదు. అంతే కాకుండా వీళ్ళు ఇచ్చే పాటలు హీరో ఇమేజ్ ని, మరొక పక్క సినిమా కథని కూడా దృష్టిలో పెట్టుకొని పాటలు కంపోజ్ చేయాలి. అలాగే ఒక యంగ్ హీరో సినిమాకి ఇచ్చిన పాటలు, ఒక స్టార్ హీరో సినిమాకి ఇచ్చిన పాటలు ఒకే లాగా ఉంటే కూడా కుదరదు. ఎవరి ఇమేజ్ కి తగ్గట్టు వారికి పాటలు కంపోజ్ చేయాలి. ఈ బ్యాలెన్స్ చేయడం అనేది వచ్చి ఉండాలి. ఈ విషయాన్ని ఈ ఇద్దరు మ్యూజిక్ డైరెక్టర్ చాలా బాగా అర్థం చేసుకుంటారు.
తమిళ్ లో ఇలా అర్థం చేసుకునే మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్. ధనుష్ హీరోగా నటించిన తిరు సినిమాకి ఒకరకమైన పాటలు ఇచ్చారు. విక్రమ్ వంటి సినిమాలకి ఇంకొక రకమైన పాటలు ఇచ్చారు. తెలుగులో తమన్, దేవి శ్రీ ప్రసాద్ కూడా అలాగే ఫాలో అవుతున్నారు. దేవి శ్రీ ప్రసాద్ రంగ్ దే వంటి సినిమాకి ఒక రకమైన పాటలు ఇచ్చారు. పుష్ప వంటి సినిమాకి మరొక రకమైన పాటలు ఇచ్చారు. తమన్ కూడా తొలిప్రేమ వంటి సినిమాకి ఒక రకమైన పాటలు ఇస్తే, వకీల్ సాబ్ లాంటి సినిమాకి ఇంకొక రకమైన పాటలు ఇచ్చారు.
వీళ్లు మాత్రమే కాదు. ఇంకా చాలా మంది మ్యూజిక్ డైరెక్టర్ తెలుగు, తమిళ ఇండస్ట్రీలో ఉన్నారు. వాళ్లు కూడా ఇంతే కష్టపడుతున్నారు. అయితే వీరికి మాత్రమే అవకాశాలు ఎందుకు ఎక్కువగా వస్తున్నాయి అంటే, అందుకు సమాధానం ఒక్కటే. వీరి పాటలు ప్రజలు ఎక్కువగా వింటున్నారు. అందుకే ప్రస్తుతం వీరికి ఉన్న మార్కెట్ దృష్ట్యా, అంతే కాకుండా పైన చెప్పిన కారణాలు ఆలోచించి ప్రస్తుతం వీరికి ఎక్కువ అవకాశాలు ఇస్తున్నారు ఏమో.
ALSO READ : “అమితాబ్ బచ్చన్” తో పాటు… “రేఖ” రిలేషన్షిప్లో ఉన్న 7 మంది హీరోలు..!
End of Article