Ads
‘ఆదిపురుష్’ సినిమా కోసం తెలుగు ప్రేక్షకులు మాత్రమే కాకుండా దేశవ్యాప్తంగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాలో ప్రభాస్ తొలిసారిగా రాముడిగా నటిస్తున్నారు. బాలీవుడ్ హీరోయిన్ కృతి సనన్ సీతగా, రావణాసురుడిగా ప్రముఖ హిందీ హీరో సైఫ్ అలీ ఖాన్ నటిస్తున్నారు.
Video Advertisement
‘ఆదిపురుష్’ సినిమా శుక్రవారం నాడు (జూన్ 16) ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఆదిపురుష్ ట్రెండింగ్‌లో ఉంది. ఈ చిత్రం పై ఎన్నో విమర్శలు వివాదాలు వచ్చాయి. అందరికన్నా ఎక్కువగా ఈ సినిమాని తెరకెక్కించిన దర్శకుడు ఓంరౌత్ ను ఎక్కువగా ట్రోల్ చేస్తున్నారు. దర్శకుడు ఓం రౌత్ గురించి ఇప్పుడు చూద్దాం..
పురాణ గాథలను, ఇతిహాసాలను మూవీగా తెరకెక్కించడం అంటే ఆ డైరెక్టర్ కి కత్తిమీద సాములాంటిదే. స్టోరీలో ఎలాంటి మార్పులు చేసినా చరిత్రకారుల విమర్శల ఎదరోకోవాల్సి వస్తుంది. అలా అనుకుని ఇంట్రెస్టింగ్ చూపించకపోతే ఆడియెన్స్ ను మెప్పించలేరు. అందువల్ల ఇటువంటి కథలను ఎంచుకునే ముందు దర్శకులు ఎక్కువగా ఆలోచిస్తారు. ఎన్నో ఏళ్ల అనుభవం కలిగిన డైరెక్టర్లు మాత్రమే ఇలాంటి సినిమాలను తెరకెక్కిస్తారు. అయితే ఆదిపురుష్ తీసిన దర్శకుడు 2 చిత్రాలను తీసిన అనుభవంతోనే భారీ బడ్జెట్‌తో ‘ఆదిపురుష్’ ను తెరకెక్కించాడు.
ఓంరౌత్ ముంబైలో పుట్టి, పెరిగారు. ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్‌లో పూర్తి చేసిన తర్వాత ఇండస్ట్రీలో అడుగుపెట్టాడు. ఓంరౌత్ తాత డాక్యుమెంటరీ ఫిల్మ్‌మేకర్ మరియు ఎడిటర్. అందువల్ల ఓంరౌత్‌కు సినిమా పై ఆసక్తి పెరిగింది. దీనికోసం తన చదువు పూర్తయ్యాక, న్యూయార్క్‌లో సిని ఫీల్డ్ కు చెందిన కోర్సులో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేశాడు. రచయితగా, దర్శకుడిగా కొన్నాళ్ల పాటు ఎమ్‌టీవీ నెట్‌వర్క్‌లో వర్క్ చేశాడు. హాంటెడ్-3డీ, సిటీ ఆఫ్ గోల్డ్ సినిమాలకు నిర్మాతగా చేశారు.
2015 లో లోకమాన్య: ఏక్ యుగ్ పురుష్ అనే మరాఠీ సినిమాతో ఓంరౌత్ డైరెక్టర్ గా మారాడు. డైరెక్టర్ గా మొదటి సినిమాకే ఫిల్మ్‌ఫేర్ అవార్డు అందుకున్నారు. 2020లో ఓంరౌత్ రెండో సినిమా ‘తానాజీ ‘ తెరకెక్కించారు. ఈ చిత్రంతో ఓంరౌత్‌కు జాతీయ అవార్డు వచ్చింది. ఇక మూడవ సినిమా రామాయణం ఆధారంగా ‘ఆదిపురుష్’ తెరకెక్కించారు. ట్రైలర్ తో ఈసినిమా పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి.
End of Article