Ads
ఇటీవల చాలా భాషల సినిమాలు తెలుగులోకి డబ్ చేసి విడుదల చేస్తున్నారు. ఇవన్నీ మన వాళ్ళు హిట్ చేస్తున్నారు. తెలుగు వారికి సినిమాల పట్ల ఉన్న అభిమానం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
Video Advertisement
దాంతో భాషతో సంబంధం లేకుండా ఏ సినిమా అయినా సరే మన వాళ్లు ఆదరిస్తారు. అయితే ఇంకొక విషయం ఏంటంటే, ఇటీవల హిట్ అయిన సినిమాల లాంటి సినిమాలు అంతకుముందు చాలానే వచ్చాయి. అది కూడా డైరెక్ట్ తెలుగులో వచ్చాయి. కానీ అవి హిట్ అవ్వలేదు.
అందుకు ఉదాహరణ ఇటీవల విడుదల అయిన సప్త సాగరాలు దాటి. రవితేజ నటించిన షాక్ సినిమా దాదాపు ఇదే స్టోరీతో ఉంటుంది. కానీ సినిమా ఫ్లాప్ అయ్యింది. ప్రేమమ్ సినిమా తెలుగులో కూడా చాలా పెద్ద హిట్ అయ్యింది. కానీ దాదాపు అదే కాన్సెప్ట్ తో వచ్చిన నా ఆటోగ్రాఫ్ స్వీట్ మెమోరీస్ సినిమాకి అంతగా ఆదరణ దక్కలేదు. ఇప్పుడు మరొక సినిమాకి కూడా ఇలాగే జరిగింది అంటూ కామెంట్స్ చేస్తున్నారు. బోయపాటి శ్రీను అంటే మాస్ మసాలా సినిమాలకి పెట్టింది పేరు. ఎలివేషన్ మీద ఎలివేషన్లు ఉంటాయి. ఒక్క ఫైట్ కి కూడా లాజిక్ ఉండదు. ఏ ఒక్కరూ కూడా మామూలుగా మాట్లాడరు. ఆయన సినిమాలని ఒక సమయంలో మన ప్రేక్షకులు బాగా ఇష్టపడ్డారు. కానీ ఇప్పుడు ఆయన సినిమాలు ట్రోలింగ్ కి గురవుతున్నాయి.
“అర్థం పర్థం లేని ఫైట్లు ఎందుకు పెడుతున్నారు?” అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మన ప్రేక్షకులకి అర్థం పర్థం లేని ఫైట్ సీన్స్ నచ్చావు అనుకుంటే అది తప్పు. ఎందుకంటే కన్నడ నుండి తెలుగులో డబ్బింగ్ అయ్యి రిలీజ్ అయిన కేజిఎఫ్ లో కూడా ఇలాంటి సీన్స్ చాలా ఉన్నాయి. కానీ అవన్నీ చూసి “ఏం ఎలివేషన్స్ రా?” అన్నారు. అయితే సెకండ్ పార్ట్ సమయానికి కొంత మందికి ఇవి కూడా నచ్చలేదు. అతిగా ఉన్నాయి అంటూ కామెంట్స్ చేసిన వారు కూడా ఉన్నారు. ఇప్పుడు అలాంటి డైరెక్టర్ మన ప్రభాస్ తో సినిమా చేశారు. సేమ్ టెంప్లేట్. సేమ్ ఎలివేషన్స్. కొన్ని ఫైట్స్ కి అయితే డిజైనింగ్ బాగానే ఉన్నా కానీ లాజిక్ కి చాలా దూరం ఉంటాయి.
కానీ ఈ సినిమాని చూసి “ఎలివేషన్స్ అంటే ఇవి” అని మళ్ళీ కామెంట్స్ చేస్తున్నారు. సినిమా బృందం అంతా సినిమా కోసం చాలా కష్టపడింది. కానీ స్కంద సినిమా కోసం వాళ్లు కూడా అంతే కష్టపడ్డారు. రామ్ ఈ సినిమా కోసం తనని తాను చాలా రకాలుగా మార్చుకున్నారు. కానీ బోయపాటి శ్రీను ఎలివేషన్స్ కూడా ఇవే కదా? అవి కామెడీగా అనిపించినప్పుడు ఇవి కామెడీగా అనిపించలేదా? ఒకవేళ సినిమా మీద ప్రశాంత్ నీల్ అనే పదం తీసేసి డైరెక్టెడ్ బై బోయపాటి శ్రీను అని పెడితే ఈ సినిమా కూడా కామెడీగా అనిపించేదా? అప్పుడు ఈ సినిమాని కూడా ట్రోల్ చేసే వాళ్ళు ఏమో.
End of Article