Ads
దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు పెరగడంతో సామాన్యుల పరిస్థితి దీనంగా మారింది. ఇది అటు ఉంచితే.. నిత్యావసర సరుకుల ధరలు, కూరగాయల ధరల రేట్లు కూడా మండిపోతున్నాయి. తాజాగా.. టమాటా ధరలు కూడా పెరగడంతో సామాన్యులు విలవిలలాడుతున్నారు.
Video Advertisement
తాజాగా.. టమాటా ధరకు రెక్కలొచ్చి పలు చోట్ల కేజీ 150 రూపాయలు పడుతోంది. కొన్నిచోట్ల కేజీ 120 రూపాయలు ఉంటుండగా.. చాలా చోట్ల కేజీ ధర వంద దాటింది. ఇది వరకు అన్నిటికంటే టమాటనే కొంత తక్కువ ధర ఉండేది.
ఇప్పుడు ఏ కూరగాయని తీసుకున్న కేజీ 60 కి పైనే ఉంటోంది. ఇక టమాటా సంగతి సరేసరి. ఏకంగా వంద రూపాయలు దాటేసింది. సాధారణంగా చలికాలం లో టమాటా ధరలు కేజీ రూ.20 నుంచి 30 రూపాయల వరకు ఉంటుంది. కానీ దక్షిణాది రాష్ట్రాల్లో ఈ ధర వంద దాటేసింది. అయితే.. టమాటా ధర ఇంత ఎక్కువ ఉండడానికి ప్రధాన కారణం ఏంటో తెలుసా..? ఆంధ్ర ప్రదేశ్ లో కురిసిన భారీ వర్షాలు.
వాస్తవానికి ఆంధ్రప్రదేశ్ టమాటా పంటకి అతిపెద్ద కేంద్రం. అక్కడ కూడా రేట్ భారీగానే ఉంది. . ఏపీ, తమిళనాడు రాష్ట్రాల్లో భారీగా వర్షాలు కురుస్తున్న కారణంగా పంటలు తీవ్రంగా దెబ్బ తినడం, రవాణా సౌకర్యాలతో ఇబ్బందుల కారణంగా చేతికి అంది వచ్చిన పంట తక్కువే ఉంది. ఈ ప్రభావం దేశవ్యాప్తంగా పడింది. ఆంధ్ర నుంచి ఉత్పత్తి తగ్గడంతో.. మహారాష్ట్రలోని షోలాపూర్,కర్ణాటకలోని చిక్బల్లాపూర్ ప్రాంతాల నుంచి టమాటా సరఫరా అవుతోంది. అయినప్పటికీ.. టమాటా కొరత తీరలేదు. దీనితో.. ఎప్పుడూ లేని విధంగా టమాటా ధర ఆకాశానికెక్కేసింది.
End of Article