చిరు సినిమానుండి త్రిష తప్పుకోడానికి అసలు కారణం ఇదేనా..? మహేష్ ఉన్నాడనే.?

చిరు సినిమానుండి త్రిష తప్పుకోడానికి అసలు కారణం ఇదేనా..? మహేష్ ఉన్నాడనే.?

by Anudeep

Ads

ఒక్కో సినిమా కథ అనుకోగానే కాస్టింగ్ కూడా త్వరగా కుదిరిపోతుంటారు. షూటింగ్ కూడా చకచకా జరిగిపోతుంది. అన్ని అలా కలిసి వచ్చేస్తుంటాయి. కొన్ని సినిమాలకు మాత్రం మొదలు పెట్టిన దగ్గరనుండి ఏదో ఒక అంశం అడ్డుపడుతుంది. అది కాస్టింగ్ రూపంలోనో, టైటిల్ రూపంలోనో మరింకేదో. చిరంజీవి ఆచార్య సినిమా పరిస్థితి ప్రస్తుతం అలానే ఉంది. సైరా ఊహించని దెబ్బ కొట్టడంతో ఆచార్యపైనే ఆశలు పెట్టుకున్నారు. కాని ఈ సినిమా మాత్రం మొదటి నుండి ఏదో ఒక సమస్య ఎదుర్కొంటూనే ఉంది .ఇప్పుడేమైందంటే.

Video Advertisement

“ఆచార్య” కన్ఫామ్డ్ టైటిల్ కాదు. కాని ఇదే టైటిల్ పెట్టాలని ఆలోచిస్తున్నారు. అయితే యంగ్ చిరూ పాత్రకి బన్ని, చరణ్,మహేశ్ బాబు ఈ ముగ్గురిలో  ఎవరిని తీసుకోవాలా అని తర్జన భర్జనలు పడ్డారు. బన్ని ని తీస్కుందాం అని చిరు అంటే, మహేశ్ ని కొరటాల శివ ప్రపోజ్ చేశాడు. బన్ని,చరణ్ లు ఆయా షూటింగ్లతో బిజిగా ఉండడంతో,మహేశ్ ని ఫైనల్ చేశారు. ఇప్పుడు ఇదే సినిమాకి మరో తలనొప్పిని తెచ్చిపెట్టింది.

ముసలి హీరోలతో నటించను అని ఒకప్పుడు త్రిష తనకు తాను పెట్టుకున్న రూల్ ని బ్రేక్ చేసుకుని, ఎవరితో అయినా నటించడానికి సిధ్దమే అని గతంలో స్టాలిన్లో చిరుతో, పేటాలో రజినితో నటించింది. ఇప్పుడు మళ్లీ చిరుతో ఆచార్యలో నటించడానికి ఒప్పుకుంది. మరో వారం రోజుల్లో షూటింగ్ కూడా స్టార్ట్ కాబోతోంది. కాని త్రిషకి మళ్లీ ఒక చిక్కొచ్చిపడింది. అది మహేశ్ రూపంలో

మహేశ్ బాబు , త్రిష గతంలో అతడు, సైనికుడు రెండు సినిమాల్లో కలిసి నటించారు.అతడు సూపర్ డూపర్ హిట్. వీళ్లిద్దరి కాంభినేషన్ కూడా హిట్టే. ఇప్పుడు చిరు సరసన త్రిష నటిస్తే, మహేశ్ సరసన నటించడానికి ఒక యంగ్ హీరోయిన్ ని తీసుకుంటారు. దాంతో త్రిష సీనియర్ కేటగిరిలోకి చేరిపోతానని భయపడుతుందట .

అంటే ఇక యంగ్ హీరోలతో నటించడానికి, తన కెరీర్ కి తనకు తానే చెక్ పెట్టుకున్నట్టు అవుతుందనే భావనతో ఈ సినిమానుండి తప్పుకుంటున్నట్టు చెప్పేసిందట. తన యాంగిల్లో ఆలోచిస్తే  త్రిష బాధలోనూ అర్దం ఉంది అనిపిస్తుంది. మన ఇండస్ట్రీలో ఒకసారి ఒక ముద్ర పడితే అంత త్వరగా దాని నుండి బయటపడడం కష్టం.

ఇప్పుడు ఇంకో హీరోయిన్ ని వెతుకులాటలో పడ్డాడు కొరటాల శివ. ఒకవైపు నయనతార, మరోవైపు కాజల్ వీళ్లిద్దరి ప్రస్తుతం కొరటాల ముందున్న ఆఫ్షన్స్. ఇద్దరిలో నయనతార అయితే తన పాత్ర పరిధి ఎంత, ఎవరితో నటించాలి అనే ఆంక్షలేం లేకుండా తనకి అప్పచెప్పిన పాత్రని నటించేస్తుంది. కాజల్ పరిస్థితి అలాగే ఉంది, ఇప్పటికే దశాబ్దం దాటిపోయింది అవకాశాలు  అంతంత మాత్రంగానే ఉన్నాయి. దాంతో వచ్చిన పాత్ర చేసుకోవడం బెటర్ అన్నట్టుగా ఉంది.  ఈ నెలాఖరులోపు తెలుస్తుంది ఎవరు చిరు పక్కన నటించేది అని.


End of Article

You may also like