Ads
ఇటీవల అయోధ్యలో శ్రీరాముడి ప్రాణ ప్రతిష్ట వేడుక ఎంతో ఘనంగా జరిగింది. ఎంతో మంది ప్రముఖులు ఈ వేడుకకి హాజరు అయ్యారు. వారిలో టాలీవుడ్ నుండి చిరంజీవి, రామ్ చరణ్, పవన్ కళ్యాణ్ వెళ్లారు. ఇంకా కొంత మందికి ఆహ్వానాలు అందినా కూడా వాళ్ళు వెళ్లలేకపోయారు అని అన్నారు.
Video Advertisement
చిరంజీవి, తన భార్య సురేఖ గారితో కలిసి వెళ్లారు. రామ్ చరణ్ కూడా ఈ వేడుకకి హాజరు అయ్యారు. తమిళ ఇండస్ట్రీ నుండి రజినీకాంత్ వెళ్లారు. తెలుగు ఇండస్ట్రీ నుండి వీళ్ళు వెళ్లడం అనేది టాలీవుడ్ కి గర్వకారణం అయ్యింది.
అయితే రామ్ చరణ్ తో పాటు, ఉపాసన కూడా ఆహ్వానాన్ని అందుకున్నారు. అయినా కూడా ఉపాసన రామ మందిరానికి వెళ్లలేకపోయారు. “ఉపాసన కూడా వచ్చి ఉంటే బాగుండేది” అంటూ చాలా మంది అన్నారు. అయితే ఉపాసన రాకపోవడానికి కారణం ఉంది అని అంటున్నారు. రామ్ చరణ్, ఉపాసన ఇటీవల తల్లిదండ్రులు అయిన విషయం తెలిసిందే. ఉపాసన పాపని తీసుకొని అంత దూరం జర్నీ చేయడం అనేది రిస్క్ తో కూడుకున్న విషయం.
అయితే, మరొక పక్క, అంతమంది జనాల మధ్యలో పాపకి కూడా ఏదైనా ప్రభావం పడే అవకాశం ఉంది అని, ఎందుకంటే అక్కడ అంతా చలిగా ఉంటుంది కాబట్టి ఆ వాతావరణం వల్ల పాప మీద ఏదైనా ప్రభావం పడుతుంది అని డాక్టర్లు సూచించడంతో ఉపాసన ఈ వేడుకకు దూరంగా ఉన్నారు అని తెలుస్తోంది. ఇందులో ఎంత వరకు నిజం ఉంది అనేది తెలియదు. అయితే ఈ వేడుకలో చిరంజీవి, రామ్ చరణ్ కి సంబంధించిన ఒక వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో కనిపిస్తోంది.
ఇందులో, వారిద్దరిని వీడియో తీస్తున్న ఒక వీడియోగ్రాఫర్, చిరంజీవిని చూపిస్తూ, “ఆయన రామ్ చరణ్ తండ్రి. అందుకే ఆయన మీద ఫోకస్ పెడుతున్నాం” అని అన్నారు. కొన్ని సంవత్సరాల ముందు రామ్ చరణ్ అంటే చిరంజీవి కొడుకుగానే తెలుసు. చిరంజీవి కొడుకుగా తన కెరీర్ మొదలు పెట్టి ఎంతో పెద్ద స్టార్ అయ్యారు అని చాలా మంది రామ్ చరణ్ ని పొగుడుతారు. అలాంటిది ఇప్పుడు చిరంజీవిని రామ్ చరణ్ తండ్రి అని అంటున్నారు. రామ్ చరణ్ ఇప్పుడు ఎంత గొప్ప స్థాయికి ఎదిగారో తెలపడానికి ఇది ఒక ఉదాహరణ. కాబట్టి ఇలాంటి సమయంలో అక్కడ ఉపాసన ఉండి ఉంటే ఇంకా బాగుండేది అని అంటున్నారు.
watch video :
https://www.instagram.com/reel/C2ZJ3aWJ3jt/?igsh=NjZiM2M3MzIxNA%3D%3D
ALSO READ : అయోధ్య ప్రాణప్రతిష్ట సమయంలో మీకు కూడా భద్రాచలం గుర్తొచ్చిందా.? కనీసం ట్రైన్ రూట్ కూడా సరిగా లేదు.!
End of Article