అయోధ్య ప్రాణప్రతిష్ట సమయంలో మీకు కూడా భద్రాచలం గుర్తొచ్చిందా.? కనీసం ట్రైన్ రూట్ కూడా సరిగా లేదు.!

అయోధ్య ప్రాణప్రతిష్ట సమయంలో మీకు కూడా భద్రాచలం గుర్తొచ్చిందా.? కనీసం ట్రైన్ రూట్ కూడా సరిగా లేదు.!

by Harika

Ads

అయోధ్యలో రాముని ప్రాణ ప్రతిష్ట వేడుక ఎంతో ఘనంగా జరిగింది. ఎంతో మంది ప్రముఖుల మధ్య, ఎంతో మంది భక్తుల మధ్య ఈ వేడుక జరిగింది. ఎన్నో దశాబ్దాల కృషికి ఇప్పుడు ఫలితం వచ్చింది. రామ మందిరం నిర్మాణం కోసం ఎంతో మంది పోరాడారు.

Video Advertisement

అలాంటి పోరాట ఫలితం ఇది. ఇది నిజంగా భారత దేశంలో మరొక పండుగ రోజు అని అన్నారు. రాముని ప్రాణ ప్రతిష్ట జరుగుతున్నప్పుడు భారతదేశంలో ఎన్నో మందిరాల్లో, ఎంతో మంది తమ ఇళ్లలో పూజ చేసుకున్నారు. భద్రాద్రిలో కూడా ఎన్నో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు.

why bhadradri did not have many train

మామిడి ఆకుల తోరణాలు కట్టి, ఎన్నో రకాల పూలతో ఆలయాన్ని ఎంతో అందంగా అలంకరించారు. నిత్య కళ్యాణ మండపంలో ఆరోజు ఉదయం సీతారాములకు సువర్ణ పుష్పార్చన చేశారు. ఆ తర్వాత సీతారాములను పట్టణ పురవీధుల్లో శోభాయాత్రకి తీసుకువెళ్లారు. ఆరోజు శ్రీరామ ప్రచార రథంతో శోభాయాత్ర చేసిన తర్వాత సాయంత్రం సుందరాకాండ దీపోత్సవం నిర్వహించారు. ఆరోజు రామాలయంలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. ఆరోజు పూజలతో పాటు ఎన్నో సాంస్కృతిక కార్యక్రమాలు కూడా నిర్వహించారు.

why bhadradri did not have many train

భద్రాచలం అనేది తెలంగాణ లో ఎంతో పేరు పొందిన పుణ్యక్షేత్రం. తెలంగాణలో మాత్రమే కాదు. భారతదేశంలో ఉన్న గొప్ప పుణ్యక్షేత్రాల్లో భద్రాచలం కూడా ఒకటి. అలాంటిది భద్రాచలానికి వెళ్లడానికి కనీస ట్రైన్ సౌకర్యం కూడా బలంగా లేదు అనేది ఆలోచించాల్సిన విషయం. భద్రాచలంకి వెళ్లడానికి కేవలం ఒక ట్రైన్ మాత్రమే ఉంది. అంత గొప్ప పుణ్యక్షేత్రానికి వెళ్లడానికి సరైన ట్రైన్ సౌకర్యం లేకపోవడం అనేది గమనార్హం.

why bhadradri did not have many train

భద్రాచలంకి వెళ్ళాలి అంటే డైరెక్ట్ ట్రైన్స్ అందుబాటులో లేవు. డోర్నకల్ లో దిగి అక్కడనుండి వెళ్ళాలి. మరొక విషయం ఏంటంటే ఇక్కడ సౌకర్యాలు కూడా మిగిలిన పుణ్యక్షేత్రాలతో పోల్చి చూస్తే అంత బాగా అందుబాటులో ఉండవు. తిరుమల లాంటి పుణ్యక్షేత్రానికి కల్పించిన వసతులు భద్రాచలానికి ఎందుకు లేవు? తిరుమలకి వెళ్లడానికి ట్రైన్లు ఎక్కువగా ఉంటాయి. అక్కడికి వెళ్లాక వసతులు కూడా బాగుంటాయి. అన్ని అందుబాటులో ఉంటాయి. యాదాద్రి విషయంలో కూడా ఇంతే. అన్ని సౌకర్యాలు ఉంటాయి.

why bhadradri did not have many train

కానీ భద్రాద్రి విషయంలో మాత్రం ఇంకా కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి ఏమో. మరి కొన్ని ట్రైన్లు ఏర్పాటు చేస్తే భద్రాచలానికి వెళ్లే భక్తుల సంఖ్య ఇంకా పెరుగుతుంది. ఇంకా ఎంతో మంది భక్తులకి రాముడిని దర్శించుకునే అవకాశం కలుగుతుంది. ఇదే విషయానికి సంబంధించి సోషల్ మీడియాలో ఒక వీడియో వైరల్ అవుతోంది. భద్రాద్రి కుర్రాడు అనే పేజ్ లో ఈ వీడియో షేర్ చేశారు.  ఈ వీడియోపై ఎంతో మంది నెటిజన్లు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు

watch video :

https://www.instagram.com/p/C2Y4gcapqbU/

ALSO READ : ఇది కదా గెలుపంటే… 32 ఏళ్ల కింద “నరేంద్ర మోడీ” శపథం… ఇప్పుడు చేసి చూపించారు.!


End of Article

You may also like