ఇది కదా గెలుపంటే… 32 ఏళ్ల కింద “నరేంద్ర మోడీ” శపథం… ఇప్పుడు చేసి చూపించారు.!

ఇది కదా గెలుపంటే… 32 ఏళ్ల కింద “నరేంద్ర మోడీ” శపథం… ఇప్పుడు చేసి చూపించారు.!

by Mounika Singaluri

Ads

ఇప్పుడు భారతదేశంలో ఎవ్వరి నోట విన్న ఎక్కడ చూసినా అయోధ్య రామ మందిరం గురించే. ఎన్నో సంవత్సరాల భారతీయుల ఆకాంక్ష నేడు నెరవేరింది. కోర్టు కేసులు ఎన్నో చిక్కులు ఎన్నో గొడవలు నడుమ అయోధ్య రామయ్య తన సంస్థానంలో కొలువు తీరాడు.

Video Advertisement

ఈ ఆలయం నిర్మాణం వెనుక ఎన్నో ఆసక్తికర విషయాలు దాగి ఉన్నాయి.మన భారత ప్రధాన మోడీ అయోధ్య రామ మందిర నిర్మాణాన్ని తన జీవిత లక్ష్యంగా పెట్టుకున్న సంగతి చాలా మందికి తెలియదు…!

గతంలో 32 ఏళ్ల కిందట ప్రధాని నరేంద్ర మోడీ ఒక శపథం చేశారు. అయోధ్యలో రామ మందిరం నిర్మాణం జరిగిన తరువాతే తాను తిరిగి అయోధ్యకి వస్తానని ప్రతిజ్ఞ చేశారు. ఇప్పుడు ఆ శపథం నెరవేరింది. నేడు కోట్లాది మంది భారతీయుల సాక్షిగా ప్రధాని మోడీ అయోధ్యలో రామ మందిరం ఆవిష్కరించారు. నాడు రామ జన్మ భూమిలో మోడీ పర్యటన అనంతరం అక్కడ పరిస్థితుల్లో చేసిన ప్రతిజ్ఞ నాటి ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

32 ఏళ్ల కిందట మోడీ కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు ఏక్తా యాత్ర నిర్వహించారు. రామమందిరం గురించి సందేశాన్ని దేశం మొత్తం తెలియజేయడానికి ఆ యాత్రను నిర్వహించారు. అప్పుడు జైశ్రీరామ్ అనే నినాదం మధ్య మోడీ ప్రతిజ్ఞ చేశారు. అయోధ్యలో రామ మందిరం నిర్మాణం తర్వాతే తాను అయోధ్యలో పెడతానని చెప్పారు. చెప్పిన విధంగానే ప్రధానమంత్రి హోదాలో ఆలయ నిర్మాణం పనులకు భూమి పూజ చేశారు.

అయోధ్యలో బాల రాముని విగ్రహ ప్రతిష్ట కోసం మోడీ ఏకంగా 11 రోజులు పాటు ఉపవాస దీక్ష చేశారు.అయోధ్యలో బాల రాముడి ప్రాణ ప్రతిష్ట తరువాత ప్రధాని మోడీ దీక్ష విరమించారు. పూజలో ఉపయోగించిన పాలతో చేసిన పానీయం చరణామృత్ ను ప్రధాని మోడీకి రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ సభ్యుడు గోవింద్ దేవ్ గిరి మహారాజ్ తాగించారు. అయోధ్య రామ మందిరం నిర్మాణంలో కీలకపాత్ర పోషించిన మన ప్రధాని నరేంద్ర మోడీకి యావత్ భారత ప్రజలు కృతజ్ఞతలు తెలుపుతున్నారు..

 


End of Article

You may also like